telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

డ్రగ్స్ వ్యవహారంలో హీరోయిన్ సంజనకు సమన్లు

Sanjana

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియన్ నటులపై కూడా డ్రగ్స్ ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో కన్నడ దర్శకుడు ఇంద్రజిత్ లోకేష్, క‌న్న‌డ న‌టి రాగిణి ద్వివేదికి సెంట్ర‌ల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు జారీ చేయడం, డ్రగ్స్ రాకెట్ కేసులో హీరోయిన్ సంజన గాల్రానీ పేరు బయటకు రావడం జనాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇందులో భాగంగా హీరోయిన్ సంజనా గల్రానీ అసిస్టెంట్ రాహుల్‌‌ను బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. రాహుల్‌తో పాటు ఈ వ్యవహారంలో సంజన పాత్ర ఏ మేర ఉందనే దానిపై ఫోకస్ పెట్టి విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో సంజనకు సమన్లు జారీ చేశారని సమాచారం. అయితే తాజాగా దీనిపై స్పందిస్తూ ఆవేదన చెందింది సంజన. మీడియా ప్రతినిధులు పదేపదే కాల్స్ చేస్తూ డ్రగ్స్ రాకెట్ వ్యవహారంపై ప్రశ్నల దాడి కురిపిస్తున్నారని, అందుకే తాను మీడియాకు దూరంగా ఉంటున్నా తప్పితే భయంతో కాదని పేర్కొంటూ ఓ ప్రకటన రిలీజ్ చేసింది సంజన. ఈ వ్యవహారంలోకి తనను అన్యాయంగా లాగుతున్నారని పేర్కొంటూ ఆమె ఆవేదన చెందింది. ఈ వ్యవహారంలో ఎన్‌సీబికి ఇంకెంతమంది ప్రముఖులు దొరుకుతారో చూడాలి. ఇక సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులకు డ్రగ్స్ డీలర్లతో కాంటాక్ట్స్ ఉన్నాయంటూ గతంలో పెను సంచలనంగా మారి నీరుగారిపోయిన డ్రగ్స్ వ్యవహారం మరి ఇప్పుడెలా మారుతుందో చూడాలి.

Related posts