telugu navyamedia
సినిమా వార్తలు

సల్మాన్ కన్నా అతని తల్లి వయసులో చిన్నది.. ఎలాగంటే…!?

Bharat

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన బాలీవుడ్ చిత్రం “భారత్” సినిమా హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ చిత్రం విడుదలైన తొలి వారంలోనే రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాలో సల్మాన్, కత్రీనాలతో పాటు సల్మాన్ తల్లిగా నటించిన సోనాలీ కులకర్ణిల అభినయానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ చిత్రంలో నటించిన సోనాలీ వయసు 44 కాగా, ఆమె కుమారునిగా నటించిన సల్మాన్ వయసు 53 ఏళ్లు. ఇటీవల సోనాలి తాను సల్మాన్ తల్లిగా నటించడం గురించి మాట్లాడారు. తన ఈ ఎంపికను తాను ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నానని, తన నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించలేదని తెలిపారు. తాను గతంలో హృతిక్ రోషన్ తల్లిగానూ నటించానని పేర్కాన్నారు. ప్రేక్షకులు ఏజ్ గ్యాప్‌ను పరిశీలించినప్పటికీ, నటనకే పెద్దపీట వేస్తారని అన్నారు. ఇది కూడా నిజమే కదా..!

Related posts