telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సల్మాన్ గర్ల్ ఫ్రెండ్స్ ఎంతమంది అంటే ?

Salman

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న “బిగ్‌బాస్-13” కార్యక్రమానికి తాజాగా కాజోల్, అజయ్ దేవ్‌గణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా “నీకు ఎంత మంది గాళ్‌ఫ్రెండ్స్” అని సల్మాన్‌ను కాజోల్ ప్రశ్నించింది. దీనికి స్పందించిన సల్మాన్.. “నా మొత్తం జీవిత కాలంలో నాకు ఐదుగురు గాళ్‌ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారు. అంతమంది గాళ్‌ఫ్రెండ్స్‌తో కలిసి తిరిగినా నేనెప్పుడూ హద్దులు దాటలేదు. నేను ఏ మహిళతోనూ సన్నిహితంగా మెలగలేదు” అని సల్మాన్ చెప్పాడు. దీనికి కాజోల్ పెద్దగా నవ్వుతూ.. “ఇది చాలా పెద్ద అబద్ధం. నేను నమ్మను. నేనే కాదు.. ఎవ్వరూ నమ్మరు” అంటూ కౌంటర్ ఇచ్చింది. దేశంలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ జాబితాలో ఎప్పట్నుంచో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఎందరో హీరోయిన్లతో ప్రేమాయణాలు సాగించిన 54 ఏళ్ల సల్మాన్ ఇప్పటివరకు వివాహం చేసుకోలేదు. సల్మాన్ పెళ్లి గురించి మీడియాలో, జనాల్లో రెగ్యులర్‌గా చర్చ జరుగుతుంటుంది.

Related posts