telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఉత్తరప్రదేశ్‌లో దారుణం…

rape

ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. 19 సంవత్సరాల యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బులాందషర్ అనే ప్రాంతంలో చోటుచేసుకుంది. అయితే మొదటగా యువతి కమ్రెద్దిన్ అనే వ్యక్తిపై కిడ్నాప్, హరాస్‌మెంట్ కేసును నమోదు చేసిందని, తరువాత కేసు వాపస్ తీసుకొని అలా ఏమీ జరగలేదనీ తన కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగా అలా చేశానట్లు చెప్పిందని స్థానిక పోలీసులు తెలిపారు. అయితే ఇంట్లో గొడవ కారణంగా ఇంటి నుంచి వెల్లిపోయి, తన స్నేహితుల ఇంట్లో ఉండి పొద్దునే ఆ యువతి ఇంటికి చేరుకుందని, కేవలం కుటుంబ సభ్యుల ఒత్తిడే కారణమనీ అటువంటి సన్నివేశాలు జరగలేదంటూ చెప్పుకొచ్చింది. ఆమె స్టేట్‌మెంట్‌ను పోలీసులు నమోదు కూడా చేసుకున్నారు. అయితే కొన్ని రోజుల తరువాత అదే వ్యక్తితో సహా మరో ఇద్దరిపై గ్యంగ్ రేప్ కేసును నమోదు చేసింది. అయితే కమ్రుద్దీన్ తనకు ఉదయం 4 గంటలకు ఫోన్ చేసి కలవమనడంతో అతడి వద్దకు వేళ్లీనని, అక్కడ అతడితో పాటు మరో ఇద్దరు కలిసి అలిఘర్‌కు తీసుకెళ్లి అక్కడే గ్యాంగ్ రేప్ చేశారని, తరువాత ఇంటికి పంపేశారని ఆమె తన కంప్లేంట్‌లో పేర్కొంది. అయితే రంగంలోకి దిగిన పోలీసులు అక్కడ నమోదయిన ఫోన్ సిగ్నల్స్‌ను పరీక్ష చేశారని, కానీ ఆమె చెప్పిన వారిలో ఇద్దరి అక్కడ నమోదు కాలేదని పోలీసు అధికారి తెలిపారు. అయితే ఈ కేసులో నిదింతులైన కమ్రెద్దీన్ ఫోన్ లొకేషన్ ఫరీదాబాద్‌లో ఉందని, ఆ రోజు అతడి ఫోన్ నుంచి ఎటువంటి ఫోన్‌కాల్ లేదా మెస్సేజ్ కానీ ఆమెకు పంపలేదని తెలిపారు. మరోకరు అవ్‌రార్, మువిన్ లొకేషన్ మాత్రం అలిఘర్‌లోని వారి నివాసంలో చూపించినట్లు తెలిపారు. అయితే నిందితులకు సంబంధించి ఎటువంటి ఆధారాలు దొరకలేదని తెలిపారు. అయితే ఇంతలోనే ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. అంతేకాకుండా ఓ సూసైడ్ నోట్‌ను విడిచి పెట్టింది. అందులో తన రేప్‌కు సంబంధించన వారే తన ఆత్మహత్యకు కారణం అంటూ రాసుకొచ్చింది. అయితే దీనిపై పోలీసులు పనితీరు సరిలేదని ఆ అధికారి సస్పెండ్‌కు గురయ్యాడని వివరించారు.

Related posts