telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

సహజీవనాలపై మానవ హక్కుల కమిషన్ .. గుర్రు.. ఇక సాగవు..

living together not permissable in rajastan

రాజస్థాన్ మానవ హక్కుల కమిషన్ సహజీవనాలపై సంచలన ఆదేశాలు జారీ చేసింది. సహజీవనాలను ప్రభుత్వం ప్రోత్సహించరాదని రాజస్థాన్ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ప్రకాష్ తాతియా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు. సహజీవనాల బారిన పడకుండా మహిళలను కాపాడేందుకు వీలుగా వారిలో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలదేనని జస్టిస్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతగా తీసుకొని సహజీవనాలను అత్యవసరంగా నిషేధించాలని జస్టిస్ ప్రకాష్ ఆదేశించారు. మహిళలు ఉంపుడుగత్తెల్లాగ ఉంటూ సహజీవనం చేయకుండా పవిత్రమైన పెళ్లి చేసుకొని గౌరవప్రదమైన జీవితం గడపాలని జస్టిస్ సూచించారు. వివాహం అనేది పవిత్ర సంబంధం అని అన్ని మతాల్లోనూ చెప్పారని, అందుకే మహిళలు సహజీవనం చేయడం మాని వివాహాలు చేసుకోవాలని రాజస్థాన్ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ప్రకాష్ కోరారు.

Related posts