telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన .. పోలీసు, ప్రభుత్వ ఉద్యోగులకు .. ప్రత్యేక జరిమానాలు.. వాచిపోద్ది..

special treatment for govt employees by traffic

ఢిల్లీ ట్రాఫిక్ విభాగం జాయింట్ పోలీసు కమిషనర్ పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన విషయంలో తాజాగా సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. దేశంలో నూతన మోటారు వాహనాల చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే వారికి రెట్టింపు జరిమానా విధించాలని ఢిల్లీ ట్రాఫిక్ విభాగం జాయింట్ పోలీసు కమిషనర్ మీనూచౌదరి తాజాగా ఆదేశించారు. ఈ మేర ఢిల్లీ ట్రాఫిక్ విభాగం జాయింట్ పోలీసు కమిషనర్ సర్క్యూలర్ జారీ చేశారు. వ్యక్తిగత, ప్రభుత్వ వాహనాలను పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు నడిపేటపుడు జాగ్రత్తగా వ్యవహరించాలని మీనూ చౌదరి ఆదేశించారు.

పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు వాహనాలు నడిపేటపుడు సిగ్నల్ జంపింగ్ అయినా, హెల్మెట్ ధరించకున్నా, కారులో సీటు బెల్టు పెట్టుకోకున్నా జరిమానాలు రెండింతలు వేస్తామని ఆమె హెచ్చరించారు. 2018వ సంవత్సరంలో 250 మంది పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారని, ఈ ఏడాది ఇప్పటివరకు వందమందికి పైగా పోలీసులు ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘించారని మీనూచౌదరి వివరించారు.

Related posts