telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

జయప్రకాశ్ రెడ్డి ఫ్యామిలీకి బాలయ్య ఆర్థిక సాయం… 10 లక్షలు

Jayaprakash Reddy

ప్రముఖ టాలీవుడ్ నటుడు జయప్రకాశ్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. గుంటూరులోని కొరిటపాడు శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. ఆయన కుమారుడు చంద్రప్రకాశ్ రెడ్డి అంత్యక్రియలను నిర్వహించారు. జయప్రకాశ్ రెడ్డి నిన్న ఉదయం 7 గంటలకు గుండెపోటుతో బాత్‌రూమ్‌లోనే కుప్పకూలిపోయారు. హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. అయితే ఆయన మరణానికి టాలీవుడ్ మాత్రమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా సంతాపం ప్రకటించారు. అయితే టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ గొప్ప మనస్సు చాటుకున్నారు. ఆయన జయ ప్రకాష్ కుటుంబానికి 10 లక్షల ఆర్ధిక సహాయాన్ని అందించారని సమాచారం. నిన్న ఆయన మరణ వార్త విన్న తర్వాత బాలయ్య… జయప్రకాష్ రెడ్డి గారు నాకు అత్యంత ఆత్మీయులు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి ఎన్నో విభిన్న చిత్రాల్లో మేము కలిసి నటించాము. ఆయన రంగస్థలం నుండి వచ్చిన వారు కాబట్టి ఆయన సినిమా రంగాన్ని, నాటక రంగాన్ని రెండు కళ్ళు గా భావించేవారు. సినిమాల్లో ఎంత బిజీ గా ఉన్నా నాటకాలు ప్రదర్శించేవారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను అని అన్నారు.

Related posts