telugu navyamedia
సినిమా వార్తలు

ప్రియుడితో స్టార్ హీరోయిన్ బ్రేకప్

Shruti Hassan Boy Friend
సినిమా ఇండస్ట్రీలో నటీనటులు డేటింగ్ లు, తరువాత బ్రేకప్ లు సాధారణమే. తాజాగా ఈ జాబితాలో శృతి హాసన్, మైఖేల్ కోర్సలే చేరిపోయారు. గత కొంతకాలంగా శృతి హాసన్, మైకేల్ కోర్సెల్ విడిపోతున్నారంటూ వస్తున్న వార్తలు నిజమయ్యాయి. తాము విడిపోయామని తెలుపుతూ శృతి ప్రియుడు మైకేల్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘జీవితం మా ఇద్దరినీ వ్యతిరేక మార్గాల్లో ఉంచింది. దురదృష్టవశాత్తు మేమిద్దరం ఒంటరి మార్గాల్లో నడవాల్సి వస్తోంది. కానీ ఈ యంగ్‌ లేడీ ఎప్పటికీ నా బెస్ట్‌ ఫ్రెండ్‌గానే మిగిలిపోతుంది. ఆమెకు జీవితాంతం ఓ స్నేహితుడిగా ఉండిపోతున్నందుకు చాలా గొప్పగా ఫీలవుతున్నాను’’ అని తన సందేశంలో పేర్కొన్నాడు మైకేల్.  
2016లో స్నేహితులుగా ఉన్న ఈ ఇద్దరూ ఆ తర్వాత ప్రేమికులుగా మారారు. రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న శ్రుతిహాసన్, తరచుగా లండన్ వెళ్లి మైకేల్‌ని కలిసి వస్తూ ఉండేదని సమాచారం. ఇక శృతిహాసన్ ఇంట్లో జరిగే కార్యక్రమాలకు మైఖెల్‌ హాజరు కావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. దీంతో మైఖెల్‌, శృతిహాసన్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారనే వార్తలు కూడా వినిపించాయి. కానీ ఇప్పుడు ఇద్దరూ విడిపోయారు. 

Related posts