telugu navyamedia
సినిమా వార్తలు

“అవెంజర్స్” వరల్డ్ రికార్డు బ్రేక్… టైటానిక్ ను కూడా ముంచేసింది

Avengers-4

“అవెంజర్స్ ఎండ్ గేమ్” పాత రికార్డులన్నిటిని బద్దలు కొట్టేస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా అతి తక్కువ కాలంలో ఎక్కువ కలెక్షన్స్ అందుకుంటున్న చిత్రంగా అవెంజర్స్ నిలిచింది. 2 బిలియన్ డాలర్స్ ను అతి వేగంగా అందుకొని 21 ఏళ్ల తరువాత సరికొత్త వరల్డ్ రికార్డ్ ను నెలకొల్పింది. అవతార్, ఇన్ఫినిటీ వార్ సినిమాల కలెక్షన్స్ ని సైతం “ఎండ్ గేమ్” దాటేసింది. టైటానిక్ (1997) అప్పట్లో కొన్నేళ్ల వరకు బాక్స్ ఆఫీస్ వద్ద తన దూకుడు ప్రదర్శించింది. మొదట్లో 2 బిలియన్ డాలర్స్ అందుకున్న సినిమాగా ఆ సినిమా నిలిచింది. ఆ రికార్డ్ ను అందుకోవడానికి టైటానిక్ కి 5,233 రోజులు పడితే అవెంజర్స్: ఎండ్ గేమ్ కేవలం 11 రోజుల సమయాన్ని మాత్రమే తీసుకుంది. అప్పట్లో టికెట్స్ ధరలు చూసుకుంటే టైటానిక్ కలెక్షన్స్ ఒక వండర్. ఇక ఇప్పుడు 11 రోజుల్లో 2 బిలియన్ డాలర్స్ ను అందుకొని అవెంజర్స్ ఎండ్ గేమ్ టాప్ లిస్ట్ లోకి చేరిపోయింది.

2 బిలియన్ డాలర్స్ ను అందుకున్న టాప్ హాలీవుడ్ మూవీస్ (రికార్డును అందుకోవడానికి పట్టిన కాలం)

1. అవెంజర్స్: ఎండ్ గేమ్ – 11 రోజులు

2. అవతార్ – 47 రోజులు

3. అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్ – 48 రోజులు

4. స్టార్ వార్: ఫోర్స్ అవెక్ నెస్ – 54 రోజులు

5. టైటానిక్ – 5,233 రోజులు

Related posts