telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రముఖ గీత రచయిత యోగేష్ గౌర్ మృతికి లతామంగేష్కర్ సంతాపం

Yogesh

ప్ర‌ముఖ గీత ర‌చ‌యిత యోగేష్ గౌర్ శుక్ర‌వారం క‌న్నుమూశారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. 60, 70ల‌లో ఆయ‌న బాలీవుడ్‌లో ఎన్నో అద్భుత‌మైన పాట‌లు రాసారు. క‌హిన్ దూర్ జ‌బ్ దిన్ దాల్ జాయే, జింద‌గీ కైసీ హై ప‌హేలీ వంటి అద్భుత పాట‌ల‌ని రాశారు. గ‌తంలో ఆయ‌న‌తో క‌లిసి ప‌ని చేసిన గాన‌కోకిల ల‌తా మంగేష్క‌ర్ .. యోగేష్ మృతికి సంతాపం తెలిపింది. లతా మంగేష్క‌ర్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా యోగేష్‌కి సంతాపం తెలియ‌జేస్తూ.. యోగేష్ జీ మ‌ర‌ణ వార్త ఇప్పుడే తెలిసింది. ఆయ‌న మృతి న‌న్ను బాధించింది. మ‌న హృద‌యాల‌ని గెలుచుకునే ఎన్నో సాంగ్స్ రాసిన ఆయ‌న పాటలని నేను ఆల‌పించాను. ప్ర‌శాంతంగా ఉండే ఆయ‌న ఇలా మ‌న‌ల్ని వ‌దిలి వెళ్ల‌డం బాధగా ఉంది అని ల‌తా ట్వీట్‌లో తెలిపారు. అంతేకాక 2018లో మాస్ట‌ర్ ‌దీనానాధ్ మంగేష్క‌ర్ అవార్డ్ అందుకున్నప్ప‌టి ఫోటో కూడా షేర్ చేశారు. 1962లో వ‌చ్చిన స‌ఖి రోబిన్ అనే చిత్రంలో యోగేష్ ఆరు పాట‌లు రాయ‌గా, వాటికి మంచి గుర్తింపు వ‌చ్చింది. ఆ త‌ర్వాత జింద‌గీ కైసే యే పహేలి, క‌హీన్ దూర్ జ‌బ్ దిన్ దాల్ జాయే వంటి ఎవ‌ర్‌గ్రీన్ పాట‌ల‌కి లిరిక్స్ అందించారు. యోగేష్ మృతికి బాలీవుడ్ ప‌రిశ్ర‌మ నివాళులు అర్పిస్తుంది.

Related posts