telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నేను ఎటువంటి డైలమాలో లేను… ‘రెడ్’ మూవీ థియేటర్‌లలోనే…

ram

కిశోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ హీరోగా శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న థ్రిల్లర్ మూవీ ‘రెడ్’. తమిళ్‌ సూపర్ హిట్ ‘తడం’ సినిమాకు అఫీషియల్ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నివేదా పేతురాజ్, మాళవిక శర్మ, అమృత అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తుండగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నారు. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో షూటింగ్స్ రద్దుకావడంతో రెడ్ మూవీ షూటింగ్ కూడా నిలిపివేయబడింది. అయితే షూటింగ్ నిలిపేయడంతో అతి త్వరలో రెడ్ మూవీని ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లో రిలీజ్ చేసేలా సినిమా యూనిట్ ఒక ఒప్పందం చేసుకుందని వార్తలు రావడంతో, హీరో రామ్ తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘నేను ఎటువంటి డైలమాలో లేను, ప్రస్తుతం గవర్నమెంట్ వారి ఆదేశాల మేరకు అందరిలానే ఇంట్లో హాయిగా సేఫ్‌గా ఉన్నాను, అలానే అతి త్వరలో లాక్‌డౌన్ పూర్తి అయిన తర్వాత మా సినిమా మిగతా షూటింగ్ పూర్తి చేసుకుని థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది’ అంటూ రామ్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.

Related posts