telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

నాలుగు గంటల్లో విధుల్లో చేరాలి.. జూనియర్‌ డాక్టర్లకు మమత వార్నింగ్‌!

BJP compliant EC West Bengal

తమ పై జరిగిన దాడిని నిరసిస్తూ పశ్చిమ బెంగాల్‌లో జూనియర్‌ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. నిరసనను నిలిపివేసి నాలుగు గంటల్లోగా విధుల్లో చేరాలని డాక్టర్లను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరించింది. కోల్‌కతాలోని ఎన్‌ఆర్‌ఎస్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో మూడు రోజుల క్రితం ఓ రోగి మృతి చెందాడు. దీంతో రోగి బంధువులు జూడాలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆ ఘటనకు నిరసనగా గత మూడు రోజుల నుంచి జూడాలు ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లను పోస్టర్ల రూపంలో ప్రభుత్వానికి తెలియజేశామని, తమకు న్యాయం చేయాలని జూడాలు డిమాండ్‌ చేశారు. .

దీంతో ఆందోళనకు దిగిన జూడాల వద్దకు సీఎం మమతా బెనర్జీ వెళ్లారు. తమకు న్యాయం కావాలని సీఎం ఎదుట జూడాలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. ఎవరైతే విధుల్లో చేరాలనుకోవడం లేదు వారు ఆస్పత్రి నుంచి వెళ్లిపోవచ్చని ఆమె స్పష్టం చేశారు. విధుల్లో చేరని వారు బయటి వారు అని పేర్కొన్నారు. ఇలాంటి నిరసనలను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోదని తేల్చిచెప్పారు.

Related posts