telugu navyamedia
ఆరోగ్యం

దేశంలో బ్లాక్ ఫంగ‌స్ కలకలం..

దేశంలో కరోనా మహమ్మారి థ‌ర్డ్ వేవ్ విజృంభిస్తుంది. రోజు రోజుకి కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఓవైపు కరోనా, మరోవైపు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సైతం వ్యాప్తి చెందుతుంది. నిన్న‌ మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసుల సంఖ్య భారీ పెరిగిపోవ‌డంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌ల‌కు గురైవుతున్నారు.

అసలే కరోనా మహమ్మారి టెన్షన్ పెడుతుంటే.. తాజాగా మళ్లీ బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతోంది. మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని తొలి బ్లాక్ ఫంగస్ కేసు నమోదైంది.

కాన్పూర్‌లో ని కాంట్ ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల వ్యక్తి కంట్లో నొప్పిగా ఉందని ఓ వ్యక్తి ఆసుపత్రి వచ్చాడు. దీంతో సదరు వ్యక్తి వైద్యుల కరోనా పరీక్షలు నిర్వహించిగా బ్లాక్ ఫంగ‌స్‌ సోకినట్లు తేలింది.

Black fungus wreaks havoc in UP as cases cross 100 mark - Coronavirus  Outbreak News

బాధితుడి ఒక కన్ను, ముక్కుకు బ్లాక్ ఫంగస్ వ్యాపించినట్లు వైద్య అధికారులు తెలిపారు. కరోనా థర్డ్‌వేవ్‌లో ఇదే తొలి కేసు అని తెలిపారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

అంతేకాకుండా ఆ వ్యక్తి షుగర్‌ కారణంగా బ్లాక్‌ ఫంగస్‌ బారినపడినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో సదరు వ్యక్తిని ప్రత్యేకంగా ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్న‌ట్లు కాన్పూర్ జీఎస్‌వీఎమ్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

కాగా.. సెకండ్‌ వేవ్‌ సమయంలో బ్లాక్‌ ఫంగస్ కార‌ణంగా పలువురు కంటి చూపును సైతం కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. థ‌ర్డ్ వేవ్‌లో మరోసారి కేసులు నమోదవుతుండడంతో ప్ర‌జ‌లు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Related posts