శ్రీకాకుళం జిల్లాలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. మంగళవారం అర్ధరాత్రి గార మండలం రామచంద్రాపురం సర్పంచ్ వెంకటరమణమూర్తిపై కొంత మంతి గుర్తుతెలియని వ్యక్తులు తుపాకితో కాల్పులు జరిపారు. దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సర్పంచ్‌ను ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే…
మంగళవారం రాత్రి శ్రీకాకుళం బాలాజీ లాడ్జ్‌లో జరిగింది ఈ ఘటన. ఆదివారంపేటకు చెందిన ఓ మహిళ వెళ్లింది. తనతో పాటు మరో ఇద్దరు వ్యక్తులను కూడా సదరు మహిళ సర్పంచ్ దగ్గరకు తీసుకెళ్లింది. సర్పంచ్‌తో మహిళ మాట్లాడుతున్న సమయంలో… ఆమెతో వచ్చిన వ్యక్తులు తుపాకీతో సర్పంచ్‌పై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ ఘటనలో వెంకటరమణకు తీవ్రగాయాలు కావడంతో ఆయన్ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఘటనా స్థలంలో పోలీసులకు రెండు బుల్లెట్లు లభ్యమయ్యాయి. దీంతో డీఎస్పీ ఆధ్వర్యంలో క్లూస్ టీమ్ వేలిముద్రలను సేకరించారు.
సర్పంచ్ వెంకటరమణపై కాల్పులకు రియలస్టేట్ వ్యాపారంలో లావాదేవీలే కారణమని అనుమానిస్తున్నారు. కాల్పులకు అసలు కారణం ఏంటని అంశంపై దర్యాప్తు చేస్తున్నారు.