హోళీ పండట పూట రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. రేఖ అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలసి ఆత్మహత్యకు పాల్పడింది. చెరువులో ఇద్దరు చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు. తల్లి రేఖ కోసం గాలింపు కొనసాగుతోంది. దీంతో స్థానికంగా తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.
వివర్లాలోకి వెళితే..
గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వర్కుటి రాజు- రేఖ దంపతులకు మూడేళ్ల అభిజ్ఞ, 6నెలల హంసిక సంతానం. కుటుంబ కలహాలతో విసిగిపోయిన రేఖ హోళీ పండగరోజు గ్రామ శివారులోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. దీంతో స్థానికంగా తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, గ్రామస్థుల సహాయముతో రేఖ మృతదేహం కోసం గాలిస్తున్నారు.
మరోవైపు మృతురాలి బంధువులు భర్త రాజు ఇంటిపై దాడి చేశారు. ఇంట్లోని ఫర్నీచర్ వస్తువులను ధ్వంసం చేశారు. భర్త రాజును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పరిస్థితి అదుపు తప్పకుండా కొత్తపల్లి గ్రామంలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు.