ఇరాన్‌లో తప్పుడు ప్రచారం కారణంగా పలువురు మృత్యువాత పడ్డారు. మద్యంతో కరోనా తగ్గిపోతుందంటూ ప్రచారం చేశారు. దీంతో నాటు సారా తాగి 27 మంది మృతి చెందారు. మరో 218 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
ఇరాన్ లో నిన్న ఒక్కరోజే కరోనా వైరస్‌తో 43 మంది మృతి చెందారు. ఇరాన్‌లో నిన్న ఒక్కరోజే 595 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఇరాన్‌లో 237 మంది మృతి చెందారు. మరో ఏడువేల మందికి కరోనా వైరస్ సోకింది. కరోనా ప్రభావం ఖైదీలపై ఉండటంతో 70వేల మంది ఖైదీలను ఇరాన్ ప్రభుత్వం విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 113 దేశాలకు కరోనా వైరస్ పాకింది. కరోనా వైరస్ మృతుల సంఖ్య 4009కి చేరింది.
ఏపీ మ్యాప్ లో అమరావతి లేకపోవడానికి వైసీపీనే కారణం: యనమల