telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

వ్యాపిస్తున్న బర్డ్‌ఫ్లూపై సమీక్ష..

Talasani Trs

ఇప్పటికే కరోనా, కరోనా స్ట్రైన్ తో వణికిపోతుంటే కొత్తగా బర్డ్‌ఫ్లూ వచ్చింది. బర్డ్‌ ఫ్లూ భయంతో నాలుగు రాష్ట్రాలే కాదు.. వాటి పొరుగు రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా ఉన్నాయి. ఈ వైరస్‌ విషయంలో ముందుగా మేల్కొంటే పెను ప్రమాదాన్ని నిలువరించవచ్చని అధికారులు చెబుతున్నారు. కానీ, ఇది ఇతర ప్రాంతాలకు విస్తరిస్తే పెను వినాశనం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే బాధిత రాష్ట్రాల్లో అధికారులు యుద్ధ ప్రతిపాదికన చర్యలు చేపట్టారు. వైరస్‌ విస్తరించకుండా ప్రయత్నాలు ప్రారంభించారు. ఇక నాలుగు రాష్ట్రాల్లో చికెన్‌ అమ్మకాలపై నిషేధం విధించారు. ఎందుకంటే కోళ్ల నుంచి ఇది వేగంగా విస్తరించే అవకాశం ఉంది. కోళ్లు మాత్రమే కాదు.. ఇతర పక్షులు, చేపల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఇక, బర్డ్‌ఫ్లూపై అధికారులతో సమీక్ష నిర్వహించారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. బర్డ్‌ ఫ్లూ విషయంలో ప్రభుత్వం అనేక జాగ్రత్తలు తీసుకుంటుందన్న ఆయన.. 1300 మందితో ఏర్పాటు చేసిన ప్రత్యేక టీమ్స్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫామ్ లలో తిరుగుతూ సూచనలు చేస్తున్నట్టు వెల్లడించారు. అయితే, వలస పక్షుల ద్వారా కొన్ని ప్రాంతాల్లో ఎఫెక్ట్ ఉండొచ్చు అనే అనుమానాలను వ్యక్తం చేసిన ఆయన.. అంతే తప్ప.. ఫ్లూ ఎఫెక్ట్ ఏమాత్రం ఉండబోదని స్పష్టం చేశారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts