telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

సీఐడీ నోటిసులు : చంద్రబాబు సంచలన నిర్ణయం

chandrababu tdp ap

చంద్రబాబుకు సిఐడి నోటీసులు రావడం ఇంకా ఏపీలో హల చల్ చేస్తూనే ఉంది. అయితే అమరావతి భూముల అక్రమాలపై టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు నిన్న నోటీసులు ఇచ్చారు ఏపీ సీఐడీ అధికారులు.. 41వ సీఆర్‌పీసీ కింద చంద్రబాబుకు నోటీసులు ఇచ్చిన అధికారులు.. విచారణకు హాజరు కావాల్సిందిగా పేర్కొన్నారు. అయితే, చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు..  ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. సీఐడీ ఇచ్చిన నోటీసులపై హైకోర్టు కు వెళ్లారు చంద్రబాబు. రాజధాని భూముల విషయంలో సీఐడీ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరారు చంద్రబాబు. ఈ మేరకు గురువారం ఏపీ హైకోర్టులో ఆయన తరఫున న్యాయవాదులు క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను సవాల్‌ చేస్తూ పిటిషన్‌ దాఖలు చేశారు. చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  

Related posts