తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్ఆర్సీ కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ కు టీ–పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ లేఖ రాశారు.
కేసీఆర్ చేసిన ప్రకటనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ అంశానికి సంబంధించి కేరళ రాష్ట్రం జీవో తీసుకొచ్చినట్టుగా, తెలంగాణలో కూడా చేయాలని ఆ లేఖలోపేర్కొన్నారు.