telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మజ్లిస్ ఏది రాసిస్తే దాన్నే కేసీఆర్ చదువుతున్నారు: కిషన్ రెడ్డి

kishanreddy on ap capital

తెలంగాణ సీఎం కేసీఆర్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. నా బర్త్ సర్టిఫికెట్టే లేదు, ఇంక మా నాయనది ఎక్కడ్నించి తెస్తాం అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. మజ్లిస్ ఏది రాసిస్తే దాన్నే కేసీఆర్ చదువుతున్నారని ఆరోపించారు.
ఎన్పీఆర్ లో భాగంగా ఎవరినీ పత్రాలు అడగబోమని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో ఏ వివరాలు అడిగారో ఎన్పీఆర్ లో కూడా అవే వివరాలు అడుగుతారని వివరించారు.

గత కొన్నేళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. సీఏఏతో ఏ విధంగా దేశ గౌరవానికి భంగం కలుగుతుందో కేసీఆర్ చెప్పాలని అన్నారు. సీఎం బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

Related posts