telugu navyamedia
తెలంగాణ వార్తలు

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్ట్‌..బొల్లారం పీఎస్‌కు త‌ర‌లింపు

*బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్ట్‌
*వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల కేసులో రాజా సింగ్ అరెస్ట్‌
*బొల్లారం పీఎస్‌కు రాజాసింగ్‌ను త‌ర‌లింపు
*రాజాసింగ్‌ వ్యాఖ్యలపై పలు పీఎస్‌లలో వరుస ఫిర్యాదులు
*సోషల్‌ మీడియాలో రాజాసింగ్‌ పెట్టిన వీడియోపై ఎంఐఎం ఆందోళనలు
*మనోభావాలు దెబ్బతీశారంటూ పోలీసుస్టేషన్ల ఎదుట నిరసనలు
*రాజాసింగ్ అరెస్ట్ తో గోషామహల్లో హైటెన్ష‌న్‌

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఘటనలో​ ఆయన్ను మంగళవారం ఉదయం ఇంటివద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా కామెంట్స్ చేస్తూ ఓ వీడియోనూ ఆయన సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. దీనిపై ఒక్కసారిగా కాంగ్రెస్, ఎంఐఎం నేతలు భగ్గుమన్నారు. హైదరాబాద్‌లోని చాలా పోలీస్‌స్టేషన్‌లలో ఫిర్యాదులు చేశారు. 

దీంతో పోలీసులు రాజాసింగ్‌పై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం రాజాసింగ్‌ను ఆయన ఇంటి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని బొల్లారం పీఎస్‌కు తరలించారు. రాజాసింగ్ అరెస్ట్ తో గోషామహల్ హైటెన్ష‌న్ నెల‌కొంది

 

Related posts