telugu navyamedia
తెలంగాణ వార్తలు

సీఎం కేసీఆర్​కు ఈమె వీరాభిమాని..ఈమె పేరు జిందం సత్తమ్మ -కేటీఆర్‌

సీఎం కేసీఆర్​కు ఈమె వీరాభిమాని…ఈమె పేరు జిందం సత్తమ్మ. .కేటీఆర్ కు కేసీఆర్‌కు ఎంత క్లోజ్ అంటే మంత్రి ఎప్పుడైనా సొంత నియోజకవర్గ పర్యటనకు వెళ్తే ఆయన్ను సత్తమ్మ సులభంగా కలిసేంతలా. .ఆఖరికి ఎంతో ఆప్యాయంగా కేటీఆర్‌ను ఆలింగనం చేసుకునేంత అభిమానం ఆమె సొంతం. సత్తమ్మ పట్ల కేటీఆర్ కూడా అంతే ఆప్యాయంగా ఉంటారు. తాజాగా జిందం సత్తమ్మ గురించి తొలిసారిగా కేటీఆర్ ప్రకటించారు.

Image

టీఆర్ఎస్‌కు ఉన్న స్పెషల్ మద్దతుదారును మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం చీర్లవంచకు చెందిన ఈమె జిందం సత్తెమ్మ గారు. టీఆర్ఎస్‌కు, సీఎం కేసీఆర్‌ హార్డ్‌కోర్‌ అభిమాని అని పేర్కొన్నారు. ఈమె తెలంగాణ ఉద్యమ సమయం నుంచి నాకు కీలక మద్దతుదారుగా ఉంది. ఈ అపరిమిత ప్రేమ, ఆప్యాయతకు ధన్యవాదాలు అంటూ మంత్రి కేటీఆర్‌ తన వ్యక్తిగత ట్విటర్ ఖాతాలో సత్తమ్మ గురించి రాశారు. ఆమెతో ఉద్యమ సమయంలో, మంత్రిగా వివిధ సందర్భాల్లో కలిసిన ఫొటోలను పోస్ట్ చేశారు.

Image

అందులో కేటీఆర్ సొంత నియోజకవర్గం పర్యటనలో సత్తెమ్మ చేతిని పట్టుకొని ఉన్న ఫోటో, ఆయన్ను ఆలింగనం చేసుకుంటున్న ఫోటో వైరల్ అవుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ కేటీఆర్ పక్కనే ఉండి విజయ చిహ్నం చూపుతున్న ఫోటో కూడా మంత్రి ట్వీట్ చేశారు.

Image

Related posts