telugu navyamedia
రాజకీయ

రైతు నాయకుడు రాకేష్ టికాయ‌త్ పై దాడి..

రైతు సంఘాల నేత రాకేష్‌ టికాయత్‌పై కర్ణాటకలో దాడి జరిగింది. ఆయన ముఖంపై కొందరు సిరా చల్లి దాడి చేశారు. 

బెంగళూరులో రైతు సంఘాలు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాకేష్ తికాయత్ వచ్చారు. ఆయన రాకను నిరసిస్తూ స్ధానికంగా కొందరు దాడికి ప్రయత్నించారు. తికాయత్ పాల్గొన్న సభలో కుర్చీలు విసిరేశారు. గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించారు.

ఇదే సమయంలో ఇందులో ఒకరు తికాయత్ మొహం, దుస్తులపై నల్ల సిరా పోశారు. దీంతో పరిస్ధితి మరింత గందరగోళంగా మారింది. తికాయత్ పై నల్ల సిరా వేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుక‌వ‌చ్చిన‌ మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున రైతు ఉద్యమాన్ని ప్రారంభించిన రాకేష్ టికాయ‌త్ పై ఓ ఛానెల్ స్టింగ్ ఆపరేషన్ చేసింది.

కర్ణాటక రైతు నేత కొడిహల్లి చంద్రశేఖర్‌ డబ్బు తీసుకుంటూ స్థానిక మీడియా స్టింగ్‌ ఆపరేషన్‌కు పట్టుబడ్డారు. ఈ వీడియోపై అందులో డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయ‌ని.. ఆ ఘటనలో తమ ప్రమేయం లేదంటూ వాళ్లు వివరణ ఇచ్చేందుకు వచ్చానని టికాయ‌త్ తెలిపారు.

Rakesh Tikait: రైతు నాయకుడు రాకేష్ టికాయ‌త్ కు ఘోర అవమానం.. సిరాదాడి చేసిన  దుండ‌గులు

ఇదిలా ఉంటే.. దాడికి పాల్పడింది స్థానిక రైతు నాయకుడు కే చంద్రశేఖర్‌ మద్దతుదారులే ఈ ఇంక్‌ విసిరినట్లు టికాయత్‌ చెప్తున్నారు. గ‌తకొంత కాలంగా.. రైతు నాయకుడు చంద్రశేఖర్ వ‌ర్గానికి, రాకేష్ టికాయ‌త్ వ‌ర్గానికి విభేదాలు వ‌చ్చిన‌ట్టు ఏర్పడిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

Related posts