telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంస, దుర్మార్గ పాలన ప్రారంభమై మూడేళ్లు..

జగన్ మూడేళ్ళ మోసకారి పాలనపై టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు చార్జ్‌షీట్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..జగన్ పాలనంతా నేరాలు, ఘోరాలమయమని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంస, దుర్మార్గ పాలన ప్రారంభమై మూడేళ్లు గడుస్తుందన్నారు..

వైసీపీ మూడేళ్ల పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందని, జగన్ పాలనలో ప్రజలకు ముప్పుతిప్పలు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ప్రభుత్వం.. విధ్వంసంతో పాలన ప్రారంభించిందని, ప్రజావేదికను కూల్చి పాలన ప్రారంభించారని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు

అని అచ్చెన్నాయుడు నినదించారు. బాదుడు నుంచి విముక్తి రావాలంటే తిరిగి చంద్రన్న రావాలి అంటూ చార్జ్ షీట్ విడుదల చేశారు అచ్చెన్నాయుడు.

నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలపై రూ.46 వేల కోట్ల విద్యుత్ భారం మోపుతున్నారని ఆరోపించారు. చార్జీలు పెరిగినా కరెంట్ కోతలు తప్పడం లేదన్నారు.

గడప గడపకు మ‌న‌ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో వైసీపీ నేతలను ప్రజలు నిలదీస్తుండటంతో.. మంత్రులు బస్సు యాత్ర చేపట్టారని ఎద్దేవా చేశారు.సామాజిక న్యాయభేరి బస్సు యాత్రతో ఎవరికి లాభం అని ప్రశ్నించారు.

2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో సన్‌రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌గా ఉండేదని చెప్పారు. వివిధ రాష్ట్రాల నుంచి పారిశ్రామికవేత్తలు వస్తుండటంతో ఏపీ కళకళలాడేదన్నారు

ధర్మాన ప్రసాదరావు ఒక మంత్రేనా? అప్పులు తెచ్చి మీట నొక్కి డబ్బులు ఇవ్వడానికి ముఖ్యమంత్రి అవసరం లేదు. రాష్ట్రంలో 10 మంది బీసీ మంత్రులు ఉన్నారని చెబుతున్నారు. 150 మంది ఎమ్మెల్యేలు ఉంటే.. 10 మంది మంత్రులు కావడం గొప్పా? 100 గెలిచి 9 మంత్రులు ఇవ్వడం గొప్పా? పేరుకే బీసీ మంత్రులు.. పెత్తనమంతా ఆ నలుగురు చేతుల్లో ఉంది. బీసీలపై జరుగుతున్న అక్రమాలపై ఒక్కసారైనా ఆయన మాట్లాడారా? మేము బీసీ కులాలకు న్యాయం జరగాలని స్వయం ఉపాధి కల్పన కోసం పరికరాలు కొంటే కనీసం వాటిని పంచేందుకు లేదు.

చంద్ర‌బాబు సీఎం ప‌ద‌వి నుంచి దిగేనాటికి ..నేటికి నిత్య‌వ‌స‌రాల ధ‌ర‌ల్లో తేడాలు ప్ర‌జ‌లు గ‌మ‌నించాల‌ని అచ్చెన్నాయుడు కోరారు. ప‌ద‌ పెట్రోల్, డిజీల్ ధరలపై అధికర ధరలు ఏపీలోనే ఉన్నాయని అన్నారు. రాష్ట్ర ప్రజలను జగన్ ప్రభుత్వం వీరబాదుడు బాదేస్తోందన్నారు.

Related posts