రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్ గా పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా ‘లైగర్’.
ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్- పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న లైగర్ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో ఆగస్ట్25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ పక్క ఈ సినిమా పనులతో బిజీగా ఉంటూనే.. మరోపక్క పార్టీ మూడ్ ని ఎంజాయ్ చేస్తుంది ‘లైగర్’ టీమ్.
గురువారం ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ సీఈవో అపూర్వ మెహతా పుట్టినరోజు సందర్భంగా ముంబైలో గ్రాండ్ పార్టీ నిర్వహించారు. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ పార్టీలో లైగర్ బ్యాచ్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. బ్లాక్ అండ్ బ్లాక్‌లో అందరూ దుమ్మురేపారు. మోస్ట్ స్టైలిష్ లుక్‌తో మెస్మరైజ్ చేశారు.
అయితే పార్టీలో విజయ్ తన కోస్టార్ అనన్య పాండేతో ముచ్చట్లు పెట్టాడు. ఇద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో ఛార్మి వెనక నుంచి వీడియో తీసింది. ఈ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఆ అజయ్ కౌండిన్య గాడిని మహిళలే తన్నుతారు… : రాకేష్ మాస్టర్