telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పెళ్లి చేసుకోబోతున్న హైపర్ ఆది… అమ్మాయిది ఏఊరంటే…

Hyper Aadi,Shivaji Raja

జబర్దస్త్ లో టీమ్ లీడర్ స్థాయికి ఎదిగిన హైపర్ ఆది అంచెలంచెలుగా ఎదుగుతూ సినిమాల్లో కూడా మంచి పాత్రలు వేస్తున్నాడు. ‘ఢీ’ షో ద్వారా యాంకర్ వర్షిణితో కలిసి లవర్ బాయ్ ఇమేజ్ కూడా సొంతం చేసుకున్నాడు. మరోవైపు అటు పొలిటికల్ గా కూడా హైపర్ ఆది ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్నాడు. ఇది ఇలా ఉంటే.. ఆది తాజాగా పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలని భావిస్తున్నాడు. తన ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని అయితే తన తల్లిదండ్రులు చూసిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు తాను ఫిక్స్ అయ్యానని చెప్పుకొచ్చాడు. అంతేకాదు హైపర్ ఆది తన పెళ్లి డేట్ కూడా చెప్పేసి అందరినీ సర్ ప్రైజ్ ఇచ్చేశాడు. తనకు నెక్ట్స్ ఇయర్ పెళ్లి అవుతుందని, తమ స్వంత జిల్లా ప్రకాశం కు చెందిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నట్లు హైపర్ ఆది క్లారిటీ ఇచ్చేశాడు.

Related posts