ఇండోనేషియా, ఈస్ట్ జావాకు చెందిన సితి మస్ఫుఫాహ్ వర్దాహ్ అనే 12 ఏళ్ల బాలిక క్రోనిక్ డయాబెటీస్‌తో బాధపడుతూ ఈ నెల 18న అక్కడి ఓ ఆసుపత్రిలో కన్నుమూసింది. దీంతో సితి మృతదేహాన్ని ఇంటికి తీసుకుపోయారు కుటుంబసభ్యులు. అంత్యక్రియల కోసం శవాన్ని సిద్ధం చేయటానికి ఏర్పాట్లు చేశారు. మృతదేహానికి స్నానం చేయించారు. స్నానం అనంతరం సితి శరీరం వెచ్చగా మారింది. మూసుకున్న కళ్లు ఠక్కున తెరుచుకున్నాయి. గుండె మళ్లీ కొట్టుకోవటం ప్రారంభించి, శరీరంలో కదలిక మొదలైంది. ఈ నేపథ్యంలో సితి తండ్రి వైద్యులను తీసుకువచ్చాడు. వారు బాలికకు ఆక్సిజన్ అందించారు. అయితే ఓ గంట తర్వాత సితి మళ్లీ చనిపోయింది. దీంతో కుటుంబసభ్యులు శవానికి మళ్లీ స్నానం చేయించి అక్కడి ఓ శ్మశానంలో ఖననం చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
previous post