telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

పచ్చి మిరపకాయలను ఇలా తింటే అన్ని రోగాలు మటాష్‌ !

పచ్చి మిరపకాయలు ప్రతి ఇంట్లో కనిపిస్తుంటాయి. అయితే.. వీటివల్ల అనేక లాభాలున్నాయి. క్యాన్సర్‌ నిరోధకంగా, గుండె మంటను తగ్గించేదిగా, బీపీని నియంత్రించేదిగా, యాంటీ బ్యాక్టీరియాగా ఇలా చాలా రకాలుగా మిర్చిలోని క్యాప్సైసిన్‌ రసాయనం ఉపయోగపడుతుంది. ఎములకను పుష్టిగా ఉంచడంతోపాటు వాటికి బలాన్ని కూడా ఇస్తుంది. పచ్చి మిరపకాయ జీర్ణశక్తిని పెంచుతుంది. అజీర్తిని తొలగిస్తుంది. పక్షవాతాన్ని తగ్గిస్తుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది. మిరపకాయ రుచిని కలిగించడమే కాకుండా ఆకలిని వృద్ధి పరుస్తుంది. కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. దెబ్బ తగిలినప్పుడు కారే రక్తాన్ని కూడా తగ్గించే శక్తి కారానికి ఉందిద. శరీరంలోని అన్ని అవయవాలను ఉత్సాహంతో పనిచేసేలా పచ్చి మిరపకాయ సహాయపడుతుంది. ఆర్థరైటిస్‌ వంటి జబ్బులను దరిచేరనీయదు. ఏవైనా ప్రమాదాల వల్ల ఏర్పడేటువంటి తీవ్రగాయాల బ్లడ్‌ క్లాటింగ్‌ సమస్యలను పచ్చి మిరపకాయలోని విటమిన్‌ -కె నివారిస్తుంది. వీటన్ని తో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందించే శక్తి దీనికుంది. అలర్జీలు, తుమ్ములు, దగ్గును కూడా తగ్గిస్తాయి పచ్చిమిరపకాయలు.

Related posts