telugu navyamedia
ఆరోగ్యం

దేశంలో తగ్గిన కరోనా కేసులు..

భారత్​లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో కేసుల సంఖ్య భారీగా తగ్గింది.
శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 1,27,952 కొత్త కేసులు నమోదయిన‌ట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ శనివారం హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది.

అయితే.. మరణాల సంఖ్య మళ్లీ భారీగా పెరిగింది. 1,059 మంది మరణించడం ఆందోళన కలిగిస్తోంది. 2,30,814 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 7.98 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.యాక్టివ్​ కేసులు ప్రస్తుతం 3.42 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 95.39 శాతానికి చేరింది.

దేశంలో ఇప్పటివరకూ మొత్తం మరణాలు 5లక్షల ఒక వెయ్యి 114 మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 13లక్షల 31,648 మంది. ఇప్పటివరకూ మొత్తం కోలుకున్నవారు సంఖ్య‌ 4,02,47,902కి చేరింది.

కాగా.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. కొత్తగా 47,53,081 మందికి టీకా పంపిణీ చేశారు. ఇప్పటివరకు దేశంలో 1,68,98,17,199 టీకా డోసులను పంపిణీ చేసిన‌ట్లు కేంద్రం తెలిపింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా వద్ద దాదాపు 13 కోట్ల మేర వ్యాక్సిన్ డోసుల వరకు నిల్వ ఉన్నట్లు సమాచారం. 

Related posts