telugu navyamedia
రాజకీయ

ఎన్నికలకు ముందు కాంగ్రెస్​కు భారీ షాక్..

ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్​ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రతన్‌జిత్ ప్రతాప్ నారాయణ్ (ఆర్​పీఎన్) ​ సింగ్​.. కాంగ్రెస్​కు గుడ్​బై చెప్పారు.

ఈ క్ర‌మంలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి రాజీనామా లేఖను పంపారు. ఈ నిర్ణయం వెంటనే అమలవుతుందని వివరించారు. ఈ దేశానికి, ప్రజలకు, పార్టీకి సేవలు అందించే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అని తెలిపారు.

ఈ రాజీనామా లేఖను ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ ఓ కామెంట్ చేశారు.  ఈ రోజు ఈ స‌మ‌యంలో అంద‌రూ గణతంత్రం దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు, నేను నా రాజకీయ ప్ర‌యాణంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాను. జై హింద్’ అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

UP Polls: RPN Singh quits Congress amidst reports of his entry into BJP

మ‌రోవైపు ఆయన.. భాజపాలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్​పీఎన్​ సింగ్​.. ఝార్ఖండ్​లో కాంగ్రెస్​ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. ఆ రాష్ట్రంలో జేఎంఎంతో కలిసి అధికారంలో ఉంది కాంగ్రెస్​.

ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో తన సన్నిహితులకు టికెట్​ నిరాకరించడమే.. సింగ్​ పార్టీని వీడేందుకు కారణమని సమాచారం. సింగ్​.. యూపీ కుషీనగర్​ నుంచి గతంలో ఎంపీగా సేవలందించారు.

యూపీలో ఆర్పీఎన్ సింగ్‌ను కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా చేసింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. అతను యూపీలోని పూర్వాంచల్‌లోని పద్రౌనా ప్రాంతానికి చెందిన నేత. కాంగ్రెస్ పార్టీలో దాదాపు 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నఆర్​పీఎన్ సింగ్ కాంగ్రెస్ పార్టీని వీడ‌డంతో చ‌ర్చానీయాంశ‌మైంది.

యూపీ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు మొత్తం 7 దశల్లో జరగనున్నాయి. ఫిబ్రవరి 10న తొలి విడత పోలింగ్​ జరగనుంది.మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.గౌతమ్​.. రెండు సార్లు రాజ్యసభ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.

Related posts