telugu navyamedia
ఆరోగ్యం

రోజుకు ఎంత పరిమాణంలో నెయ్యి తీసుకోవాలో తెలుసా!

భారతీ దేశ సాంప్రదాయ వంటకాల తయారీలో నెయ్యిని విస్తృతంగా వినియోగిస్తుంటాం. వేద కాలం నుంచి మన దేశంలో నెయ్యి వాడకం మనుగడలో ఉంది. భారతీయ వంటకాలు, భోజనాల్లో నెయ్యిది అగ్రస్థానమనే చెప్పాలి. కొందరు అన్నంలో నెయ్యి లేకుండా ముద్ద ముట్టరు. ముఖ్యంగా దక్షిణ భారతంలో ఈ అలవాటు చాలా ఎక్కువ.

ఇక, పిండివంటలు, స్వీట్ల తయారీలో నెయ్యిని విరివిగా ఉపయోగిస్తుంటాం. ఎందుకంటే నెయ్యి పిల్లలు, వృద్ధులకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చుతుంది. పిల్లల ఎత్తు, మానసిక వికాసాన్ని పెంచడంలో నెయ్యి సహాయపడుతుంది. అదే సమయంలో వృద్ధులకు జౌషధంగా పనిచేస్తుంది. ఇవి వారి ఎముకలను ధృడంగా మారుస్తుంది. నడవడానికి ఇబ్బంది కలగకుండా బలాన్ని అందిస్తుంది.

అయితే, ఎన్ని లాభాలున్నప్పటికీ పరిమితికి మించి తీసుకుంటే ఏదైనా అనర్థమే. మరి నెయ్యి విషయంలోనూ ఈ సూత్రం పనిచేస్తుందా? రోజుకు ఎంత పరిమాణంలో నెయ్యి తీసుకోవాలి? అనే కీలక అంశాలను తెలుసుకుందాం.

‘‘మనం తినే ఆహారం ఆధారంగా నెయ్యిని జోడించాలి. ఉదాహరణకు మీరు మిల్లెట్ బ్రెడ్ తినేటప్పుడు దానిలో కొంచెం ఎక్కువ నెయ్యి లేదా వెన్నని ఉపయోగించవచ్చు. అదే, పప్పు, అన్నంలో మాత్రం నెయ్యిని ఎక్కువగా వాడొద్దు. ఎందుకంటే ఎక్కువ నెయ్యిని జోడించడం వల్ల ఆహారం రుచి మారుతుంది. అదేవిధంగా ఇది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.” అని నిపుణులు అంటున్నారు.

బయట మార్కెట్లో దొరికే నెయ్యి చాలా వరకు స్వచ్ఛత ఉండదు. అనేక రసాయనాలతో దాన్ని తయారు చేస్తారు. తద్వారా, లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయని గుర్తించుకోవాలి. అందుకే, ఆవు లేదా గేదె పాల నుంచి తీసిన స్వచ్ఛమైన నెయ్యిని తినడానికి ప్రయత్నించండి. మీ రోగనిరోధక వ్యవస్థకు మెరుగుపర్చుకునేందుకు విటమిన్లతో సమృద్ధిగా ఉండే నెయ్యిని ప్రతిరోజూ మీ భోజనంలో కనీసం ఒకదానినైనా చేర్చండి. ప్రతి రోజూ 3 నుంచి -6 టీస్పూన్ల నెయ్యిని తీసుకోవడం మంచిది. అల్పాహారం, భోజనం, విందు సమయాల్లో ఒక టీస్పూన్ నెయ్యి తీసుకోవడం లాభిస్తుంది.

Related posts