telugu navyamedia
రాజకీయ

ఈ నెలలోనే థర్డ్​ వేవ్ ముప్పు​..

భార‌త‌దేశంలో కరోనా మ‌హ‌మ్మారి మూడో ఉద్ధృతి ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఈ నెలలోనే థర్డ్ వేవ్ ప్రారంభం కానుందని.. అది క్రమంగా పెరుగుతూ జనవరి-ఏప్రిల్‌ మధ్య అది తీవ్రస్థాయికి చేరుకోవచ్చని ఐఐటీ పరిశోధకులు పేర్కొన్నారు.

పర్యాటకుల సంఖ్య అకస్మాత్తుగా పెరగడం, సామాజిక-రాజకీయ-మతపరమైన కారణాలతో ప్రజలు పెద్దఎత్తున గుమికూడటం వంటివి మూడో ఉద్ధృతికి దారితీయొచ్చని అన్నారు. హోటళ్లు, కేఫ్‌లలో కూర్చొని ఎక్కువసేపు మాట్లాడుకోవడం.. కరచాలనం చేసుకోవడం వంటి చర్యలతో ముప్పు ఇంకా పెరుగుతుంద‌ని శాస్త్రవేత్తలు తెలిపారు. 

రాష్ట్రాల స్థాయుల్లో ఆంక్షలను సరళతరం చేస్తే.. మూడో ఉద్ధృతి ముప్పు ఆటోమేటిక్‌గా పెరుగుతుంది.భారత్‌లో జన సాంద్రత ఎక్కువ కాబట్టి మూడో వేవ్‌లో కొన్ని ప్రాంతాల్లో రోజువారీ కేసుల పెరుగుదల 103% వరకూ ఉండొచ్చు.కొవిడ్‌ ఆంక్షల్ని పూర్తిగా ఎత్తేసినా.. పర్యాటకుల తాకిడి లేకపోతే మూడో ఉద్ధృతి తీవ్రత కొంతమేర తగ్గుతుంది. ఆంక్షల ఎత్తివేతతో పాటు సెలవు రోజుల్లో పర్యాటకుల సంఖ్య కూడా పెరిగితే మాత్రం మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది.మనుషులు పరస్పరం దగ్గరగా ఉండి మాట్లాడుకుంటే.. కరోనా వంటి శ్వాసకోశ సంబంధ రోగాలు విస్తృతంగా వ్యాపించే అవకాశాలుంటాయి.

హోటళ్లు, కేఫ్‌లలో కూర్చొని ఎక్కువసేపు మాట్లాడుకోవడం.. కరచాలనం చేసుకోవడం వంటి చర్యలతో ముప్పు ఇంకా పెరుగుతుంది.వాస్తవానికి సమాజ జీవనం క్రమంగా సాధారణ స్థితికి రావడం వల్ల మేలే జరుగుతుంది. దేశీయ పర్యాటకం పెరిగితే.. సందర్శకులకే కాకుండా, స్థానిక వ్యాపారులకూ లబ్ధి చేకూరుతుంది. కానీ- పర్యాటకులు, స్థానికులు, అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కరోనా వ్యాప్తి పెరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే అందరి సంక్షేమాన్ని కాపాడుకుంటూ ముందడుగు వేయడం సాధ్యమవుతుందని అన్నారు.

మూడో దశ వ్యాప్తి పీక్‌లో ఉన్నప్పుడు రోజువారీ కేసుల సంఖ్య లక్షలోపు ఉంటుందని.. పరిస్థితులు మరింత దిగజారితే 1.5 లక్షలకూ చేరొచ్చని అంచనా వేశారు. కొవిడ్‌ కేసులు ఎక్కువగా నమోదయ్యే కేరళ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు పరిస్థితిని హఠాత్తుగా మార్చేయవచ్చని కూడా తెలిపారు.

Children below 18 years at risk in Covid 3rd wave. Experts explain why - Coronavirus Outbreak News

ముఖ్యంగా పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచనలు చేస్తున్నారు.  అయితే రెండో దశ విజృంభణతో పోలిస్తే దీని తీవ్రత తక్కువగానే ఉంటుందని తెలిపారు. ప్రస్తుత పండగల సీజన్‌లో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. కనీసం మరో 6-8 వారాల పాటు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టే అవకాశముందని పేర్కొన్నారు.

Related posts