telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ సామాజిక

వేసవిలో .. మట్టికుండలో నీళ్లు .. ఎంతో శ్రేష్టం .. తెలుసా..!

earthen pot water is good in summer

ఎండల వేడికి చాలా మంది ఫ్రిజ్‌ల‌లోని చ‌ల్ల‌ని నీటిని తాగుతున్నారు. కానీ ఒకప్పుడు మ‌న పెద్ద‌లు, పూర్వీకులు కేవలం మట్టికుండ‌ల్లో ఉంచిన నీటిని మాత్ర‌మే తాగేవారు. నిజానికి ఆ నీరే మ‌న‌కు ఆరోగ్య‌క‌రం. మట్టికుండ‌ల్లోని చల్ల‌ని నీటినే మ‌నం తాగాలి. దానితో మ‌న‌కు దాహం తీర‌డ‌మే కాదు, అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజనాలు కూడా క‌లుగుతాయి. మ‌రి మ‌ట్టికుండ‌ల్లోని నీటిని తాగితే మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసుకుందాం..

* మ‌ట్టి ఆల్క‌లైన్ స్వభావాన్ని క‌లిగి ఉంటుంది. అందువల్ల దాంతో త‌యారు చేసిన కుండ‌లో నీటిని పోస్తే ఆ నీరు కూడా ఆల్కలైన్ స్వభావాన్ని పొందుతాయి. ఈ క్ర‌మంలో ఆ నీటిని తాగితే మన శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. జీర్ణ స‌మ‌స్య‌లు పోతాయి.

earthen pot water is good in summer* మ‌ట్టికుండ‌లో నీటిని తాగ‌డం వ‌ల్ల శ‌రీర మెట‌బాలిజం రేటు క్ర‌మ‌బ‌ద్దీక‌రించ‌బ‌డుతుంది. దీంతో బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉంటుంది.

* మ‌ట్టికుండ‌లో నీటిని తాగితే గొంతుకు సంబంధించిన స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. గొంతు ఇన్ఫెక్ష‌న్లు, నొప్పి ఉన్న‌వారు కుండ‌ల్లో నీటిని తాగ‌డం మంచిది.

* అధిక బ‌రువుతో బాధ‌పడేవారు మ‌ట్టికుండ‌ల్లో నీటిని తాగడం మంచిది. దాంతో బ‌రువు తగ్గుతారు.

Related posts