telugu navyamedia
ఆరోగ్యం

దేశంలో త‌గ్గిన‌ కరోనా కేసులు..

దేశంలో కరోనా థర్డ్ వేవ్ తగ్గుముఖం పట్టింది.. కరోనా కేసులు కాస్త త‌గ్తాయి. గడిచిన 24 గంటల్లో కొత్త‌గా 67,084 కేసులు న‌మోదయ్యాయి.

అలాగే, 1,241 మంది కరోనా వైర‌స్‌తో మ‌ర‌ణించారు. లక్ష 67 వేల 882 మంది కరోనా నుంచి కోలుకున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా బులెటిన్‌లో వెల్ల‌డించింది..

పాజిటివిటీ రేటు 4.44శాతం నమోదైంది. దేశ వ్యాప్తంగా మొత్తం 7లక్ష 90 వేల 789 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం ఇప్పటి వరకు 5లక్షల 6వేల 520మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

ప్ర‌స్తుతం దేశంలో యా క్టివ్​ కేసులు ప్రస్తుతం 1.86 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 96.95 శాతానికి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మ‌రోవైపు క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను ముమ్మ‌రంగా నిర్వ‌హిస్తోంది.దేశంలో కొత్తగా 46,44,382 టీకా డోసులను పంపిణీ చేశారు. ఇప్పటివరకు మొత్తం 1,71,28,19,947 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

Related posts