telugu navyamedia
ఆంధ్ర వార్తలు

శ్రీవారి దర్శనానికి అమలులోకి కొవిడ్ సర్టిఫికెట్..

కలియుగదైవం కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతి వెంక‌టేశ్వ‌ర‌స్వామి భక్తుల పాలిట కొంగుబంగారంగా కోరిన కోర్కెలు తీర్చేశ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తున్న భక్తులకు కొవిడ్ సర్టిఫికెట్ తనిఖీ అమలులోకి వచ్చింది. భక్తులకు వ్యాక్సినేష‌న్ లేదా ఆర్టీపీసీఆర్ నెగిటివ్ సర్టిఫికెట్ ఉన్నవారికే అనుమతి ఇవ్వ‌నున్న‌ట్లు టిటిడి అధికారులు తెలిపారు.

కోవిడ్ వ్యాప్తి నివారణలో భాగంగా భక్తులు, ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని వ్యాక్సినేష‌న్ సర్టిఫికేట్ కానీ, దర్శనానికి 72 గంటల ముందు చేసుకున్న ఆర్‌టిపిసిఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్ కానీ త‌ప్ప‌నిస‌రిగా తీసుకురావాల‌ని టిటిడి విజ్ఞ‌ప్తి చేసింది. 18 ఏళ్ల లోపు వారికి టీటీడీ నిబంధనలు వర్తించనున్నాయి.

IRCTC Tourism offers 13-day tour package to Tirupati, Rameshwaram and Kanyakumari; check details | India News,The Indian Express

ప‌లువురు భ‌క్తులు ద‌ర్శ‌న టికెట్లు లేకుండా స్వామివారి ద‌ర్శ‌నం కోసం వ‌స్తుండ‌డంతో అలిపిరి చెక్ పాయింట్ వ‌ద్ద సిబ్బంది త‌నిఖీ చేసి వెన‌క్కు పంపుతున్నారు. కావున భ‌క్తులు ఈ విష‌యాల‌ను గ‌మ‌నించి టిటిడికి స‌హ‌క‌రించాల‌ని కోర‌డ‌మైన‌ది. టికెట్లు లేకుండా ఆనేకమంది భక్తులు శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వ‌స్తుండ‌టంతో టీటీడీ ఈ విధంగా మరోసారి ప్రకటన చేసింది.

టీటీడీ నిర్ణయంతో శ్రీవారి భక్తులు అయోమయంలో ఉన్నారు. వీఐపీలకు మాత్రం కొవిడ్ సర్టిఫికెట్‌ విధానం అమలు కాలేదు. సామాన్యులకేనా నిబంధనలు అని భక్తులు మండిపడుతున్నారు.

Related posts