telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

గోరింటాకు ఆ సమస్యలు మటాష్ !

గోరింటాకు అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఎరుపు రంగు. ఎందుకంటే ఈ గోరింటాక్‌ పెట్టుకుంటే చేతులు ఎర్రగా మారిపోతాయి. మహిళలు ఎంతో ఇష్టపడి పెట్టుకుంటారు. అయితే… ఈ గోరింటాకు వల్ల ఎన్నో లాభాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గోరింటాకు క్రిములను, కంటికి కనిపించని సూక్ష్మ జీవులను చంపేస్తుంది.

గోరింటాకు పెట్టుకోవడం వల్ల గోళ్లలో ఏర్పడే ఇన్‌ఫెక్షన్లకు చెక్‌ పెట్టొచ్చు.
అలెర్జీలను దూరం చేసుకోవచ్చు
బోదకాలు వ్యాధి-ఏనుగు కాలు దరిచేరదు.
ఆటలమ్మ మచ్చలు పోగొట్టాలంటే గోరింటాకు బాగా నూరి మచ్చలపై పూస్తే సరిపోతుంది
వేడిగడ్డలకు సైతం గోరింటాకు నయం చేస్తుంది. 
అరికాళ్ల మంటను, కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది.
గోరింటాకు నమిలితే చిగుళ్ల వ్యాధి, నోటి పూత రావు.
చెట్టు బెరడును నానబెట్టి ద్రవాన్ని తాగితే కాలేయం, ప్లీహం, గుండెకు ఆరోగ్యం.

అలాగే నెలకోసారి గోరింటాకు పేస్ట్‌తో తలకు ప్యాక్‌ వేసుకుంటే..
జుట్టు బలపడుతుంది
జుట్టు రాలటాన్ని ఆపొచ్చు
చుండ్రు సమస్యకు శాశ్వతంగా చెక్‌ పెట్టొచ్చు
దీని వల్ల మృదువైన జుట్టు మీ సొంత అవుతుంది

Related posts