క్రికెటర్ గౌతమ్ గంభీర్ రాజకీయాలలో కాలుమోపారు. ఈ ఉదయం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సమక్షంలో బీజేపీలో చేరారు. గత కొంతకాలంగా ఆయన బీజేపీలో చేరతారని, ఆయనకు ఢిల్లీలోని ఒక నియోజకవర్గం నుంచి సీటు ఖరారైందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గంభీర్ కు అరుణ్ జైట్లీ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
ఆయన్ను లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దింపే ఆలోచనలో ఉన్నట్టు పార్టీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. దేశ సమగ్రతకు సంబంధించిన అంశాలపై మిగతావారికన్నా ముందుగా స్పందించే గంభీర్, పుల్వామా దాడి తరువాత, ప్రపంచకప్ క్రికెట్ పోటీల్లో పాక్ తో మ్యాచ్ ఆడొద్దని సూచించగా, దేశవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఆయన వ్యాఖ్యలకు మద్దతు పలికిన సంగతి తెలిసిందే.
ఏం చూసుకుని మగాడ్నని ఫీల్ అవుతున్నాడో… మాధవీలత ఫైర్