telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పోలవరానికి జగన్‌… షెడ్యూల్‌ ఇదే

cm jagan

సీఎం జగన్‌ పోలవరం ప్రాజెక్టుపై దృష్టిపెట్టారు. 2021 డిసెంబర్‌ నాటికి ఎట్టిపరిస్థితుల్లోనూ పోలవరాన్ని పూర్తి చేసి 2022 ఖరీఫ్‌కు నీళ్లిస్తామన్న సీఎం జగన్‌ ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు. పోలవరం పనుల్లో వేగం పెంచేందుకు క్షేత్ర స్థాయి పర్యటనకు సిద్ధమయ్యారు. సీఎం జగన్‌ రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పోలవరం సంబంధించి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం పర్యటన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పరిశీలించారు. ప్రాజెక్టు పర్యటనలో భాగంగా సీఎం జగన్‌ పోలవరం నిర్మాణ పనులతో పాటు స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌ పనులను స్వయంగా పరిశీలించనున్నారు. అనంతరం పోలవరం నిర్మాణ పనులపై సాగునీటి శాఖ అధికారులు, కాంట్రాక్టర్లతో జగన్‌ సమీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా.. ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో స్పిల్‌ వేలో 217443 క్యూబిక్‌ మీటర్లు కాంక్రీట్‌ పనులు పూర్తి చేయగా.. స్పిల్‌ వే పిల్లర్లపై 160 గడ్డర్లు ఏర్పాటుతో 52 మీటర్లు ఎత్తుకు నిర్మించారు. గేట్ల ఏర్పాటులో కీలకమైన 48 ట్రూనియన్‌ భీంలకు గానూ 30 ట్రూనియన్‌ భీంల నిర్మాణం పూర్తి చేశారు.

Related posts