నవరస నటసార్వభౌమ కైకాల సత్యనారాయణ పుట్టినరోజు నేడు. నటుడుగా గత ఏడాది షష్ఠిపూర్తి చేసుకున్నారు. 1931లో తొలి తెలుగు టాకీ సినిమా `భక్త ప్రహ్లాద` విడుదల అయితే..1935 జులై 25న సత్యనారాయణ జన్మించారు. 1959లో ఆయన నటించిన `సిపాయి కూతురు` విడుదలైంది. ఇప్పటికి నటుడిగా 61 సంవత్సరాలు కాగా.. వ్యక్తిగతంగా ఈ ఏడాది జులై 25కి 85 సంవత్సరాలు పూర్తయింది. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా సినీపరిశ్రమ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పేరు పేరునా వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. తమ్ముళ్లు చిరంజీవి, పవన్ కల్యాణ్ తనకు ప్రత్యేకించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారని కైకాల వెల్లడించారు. వారికి ధన్యవాదాలు తెలిపారు. తన బందుమిత్రులు, కుటుంబ సభ్యులు సహా అభిమానులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు.
previous post
next post