telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

తాటి ముంజలు తింటే 100 రోగాలు మాయం !

తాటి ముంజలు పేరు చెప్పగానే… అబ్బా తినేయాలని అనిపిస్తుంది. ఈ తాటి ముంజు కాలం వచ్చేసింది. మార్చి నెల నుంచే ఈ ముంజలు లభిస్తాయి. ఎక్కువగా ఇవి పల్లె టూర్లలో దొరుకుతాయి. అలాగే శ్రేష్టమైన ముంజలు కూడా పల్లెటూర్లలోనే లభిస్తాయి. అయితే.. ఇవి తినటం వల్ల లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…
తాటి ముంజల్లో విటమిన్ బి7, విటమిన్‌ కె, సోలెబుల్‌ ఫైబర్‌, పొటాషియం, కాల్షియం, విటమిన్‌ ఎ, విటమిన్‌ సీ, విటమిన్‌ డీ, జింక్‌, ఐరన్‌లతో పాటు న్యూట్రిన్స్‌ ఉంటాయి.
తాటి ముంజల్లో నీటిశాతం ఎక్కువ ఉండటం వల్ల వేసవిలో వడదెబ్బ తగలకుండా చేస్తాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తాయి. వీటిల్లో ఉండే అధిక నీటి శాతం శరీరం డీ హైడ్రేషన్‌ బారిన పడకుండా చేసి శరీరానికి చలువని అందిస్తాయి.
వీటిల్లో పొటాషియం సమృద్దిగా ఉండటం వల్ల రక్తపోటు అదుపులో ఉండి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. అంతే కాకుండా ఇవి శరీరంలోని హానికర వ్యర్థ పదార్ధాలను తొలగించడంలో అద్భుతంగా పని చేస్తుంది.
వేసవిలో తాటిముంజలను రోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా లివర్‌ సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చు. తాటి ముంజలు తినడం వల్ల చెడు కొలస్ట్రాల్‌ పోయి మంచి కోలస్ట్రాల్‌ వృద్ధి చెందుతాయి.
తాటి ముంజల్లో ఉండే పోషకాలు జీర్ణ సంబంధిత సమస్యను తగ్గిస్తాయి. వీటిని తినడం వల్ల తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణమై గ్యాస్‌, ఎసిడీటి, కడుపు ఉబ్బరంగా ఉండే ఉదర సంబంధిత సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి.
వేసవిలో ఎండ కారణంగా వచ్చే వికారం, వాంతులను నివారిస్తుంది. మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ ను రాకుండా కాపాడుతుంది. వేసవిలో వచ్చే చికెన్‌ పాక్స్‌ని నివారిస్తుంది.
తాటి ముంజల్ని గుజ్జుగా చేసి ముఖానికి వైపూతలా వేసుకుంటే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ఇది చర్మానికి కావాల్సినంత తేమను అందించి వేసవి కాలంలో వచ్చే చెమటకాయను నివారిస్తుంది.

Related posts