హేమా పటేల్ అనే 51 ఏళ్ల భారతీయ మహిళను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. దొంగతనంగా భారతీయులను అమెరికా చేరవేస్తున్న కేసులో 48 కోట్లపైగా జరిమానా విధిస్తున్నట్లు న్యూయార్క్ కోర్టు ప్రకటించింది. ఈ కేసులో హేమ భారతీయులను అమెరికాకు తీసుకొచ్చే నెపంతో ఒక్కొక్కరి వద్ద 20 నుంచి 40 లక్షల రూపాయల వరకు వసూలు చేసేదని అధికారులు తెలిపారు. తనకు సొమ్ము కట్టిన వారిని దొంగచాటుగా అమెరికా సరిహద్దు దాటించడానికి హేమ ప్రయత్నించేది. అలా చేస్తూ వారు అక్కడి భద్రతా దళాలకు దొరికిపోయేవారు. అప్పుడు హేమ రంగ ప్రవేశం చేసి, నకిలీ పత్రాలు చూపించి వారిని తనతో అమెరికా తీసుకొచ్చేది. దీనికోసం మానవ అక్రమ రవాణా ముఠాలతో హేమ చేతులు కలిపిందని దర్యాప్తులో తేలింది. ఈ అక్రమాలను గుర్తించిన పోలీసులు గతేడాది జూన్‌లో హేమను అదుపులోకి తీసుకున్నారు. ఇక హేమ ఎక్కువగా భారతీయులనే టార్గెట్ చేసిందని అధికారులు చెప్తున్నారు.
previous post
next post
బీజేపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు: కన్నా