telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

జీడిపప్పును తేనెతో కలిపి తీసుకుంటే… ఆ సమస్యకు చెక్..

డ్రై ఫ్రూట్స్ అనగానే ముందుగా గుర్తొచ్చేది జీడిపప్పు. అయితే అధిక కేలరీల శక్తిని అందించే జీడిపప్పు తింటే బరువు పెరుగుతారనీ, ఊబకాయం సమస్య వస్తుందని చాలా మంది అపోహ పడుతుంటారు. కానీ జీడిపప్పు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీడిపప్పులో ప్రొటీన్లు సమృద్ధి ఉంటాయి. ఈ ప్రొటీన్‌ చాలా సులభంగా జీర్ణమవుతుంది కూడా. జీడిపప్పులోని సెలీనియం, విటమిన్‌-ఇ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్ ప్రభావాన్ని అరికట్టి క్యాన్సర్‌ ముప్పు నుంచి కాపాడుతాయి. జీడిపప్పును ఎండుద్రాక్షతో కలిపి తీసుకుంటే రుచికరంగా ఉండడమే కాకుండా, రక్తహీనత హరిస్తుంది. జీడిపప్పు నరాలకు పటుత్వాన్ని కలిగించడంతో పాటు, జీవశక్తిని బలోపేతం చేస్తుంది.
జీడిపప్పులో ఉండే కాపర్‌ మూలంగా ఎంజైమ్‌ల పనితీరు మెరుగుపడటమే గాక మెదడు చురుకుగా పనిచేస్తుంది. జీడిపప్పు తినటం ద్వారా లభించే జింక్‌ పలు రకాల ఇన్‌ఫెక్షన్లపై పోరాడుతుంది. జీడిపప్పులో సోడియం బహు తక్కువగా ఉండటమే గాక పొటాషియం ఎక్కువగా ఉంటుంది. జీడిపప్పు తిన్నప్పుడు శరీరానికి అందే పొటాషియం మూలంగా రక్తపోటును అదుపులో ఉంటుంది. జీడిపప్పులో కొవ్వు అధికంగా ఉన్న మాట నిజమే గానీ అది ఆరోగ్యానికి మేలు చేసేదే. ఈ మేలు చేసే కొవ్వు గుండె జబ్బులు రానీయకుండా చూస్తుంది. శారీరక బలహీనతను పోగొట్టడంతో పాటు, తరచూ వాంతులు కావడాన్ని కూడా నివారిస్తుంది. రోజు జీడిపప్పు తినే వారిలో కిడ్నీ రాళ్ళ సమస్య వచ్చే అవకాశం బాగా తక్కువ.
తరచూ జీడిపప్పు తినే మహిళల్లో హార్మోన్ల ఉత్పత్తిలో హెచ్చు తగ్గులు ఉండవు. జీడిపప్పులోని రిబోఫ్లావిన్, పాంటోథీనిక్ ఆసిడ్, థైయామిన్, నియాసిన్ వంటి విటమిన్లు రక్తహీనత సమస్య రాకుండా చూస్తాయి. ఇనుము సమృద్ధిగా ఉండే జీడిపప్పు రక్తంలోని హిమోగ్లోబిన్‌ను పెంచుతుంది. ఇది వీర్య కణాలను పెంచడంతో పాటు చిక్కబరుస్తుంది. జీడిపప్పును రోజూ తింటే నపుంసకత్వం కూడా తొలగిపోతుంది. విద్యార్థులు ప్రతిరోజూ పరగడుపున కొద్దిగా జీడిపప్పు, తేనెతో తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్‌ను ఎదిరించే స్వభావం కూడా జీడిపప్పులో ఉంది. జీడిపప్పు మేలు చేస్తుందని అదేపనిగా తినేయకండి. రోజులో 4 నుంచి 8 కాజులు, అదీ ఒకేసారిగా కాకుండా నాలుగైదుసార్లు తినడం వల్ల మీ శరీరానికి కొత్త శక్తి వస్తుంది.

Related posts