telugu navyamedia
ఆరోగ్యం

ప్రతి రోజూ బెల్లం తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ప్రతి రోజూ ఓ బెల్లం ముక్కను నోట్లో వేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ ఆరోగ్యం మీద శ్రద్ధ పెడుతున్నారు. ఎటువంటి ఆహారం తీసుకుంటే మంచిది అని ఆలోచిస్తున్నారు. బెల్లం నోటికి తీపిని ఇవ్వడమే కాదు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడుతుంది.


*జలుబు చేసినప్పుడు ఒక ముక్క బెల్లం తీని గోరు వెచ్చని నీరు తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇది ప్రాథమిక చికిత్సగా పనిచేయడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
*నిత్యం బెల్లం తీసుకోవడం వల్ల యవ్వనం పెరుగుతుంది. ముఖం మచ్చలు, చర్మంపై ముడతలను తొలగించి మంచి నిగారింపు ఇస్తుంది.
*బెల్లంలో ఇరన్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే బెల్లం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.


*రోజూ బెల్లం ముక్క తినడం వలన వెంట్రుకల సమస్యలు తొలగుతాయి. ఇందుకోసం గోరు వెచ్చని నీటితో బెల్లం తీసుకోవాలి.
*ఆహారంతో ప్రతి రోజులు బెల్లం తీసుకోవడం వల్ల రక్త హీనత సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయులు పెరుగుతాయి.
*టీ, కాఫీల్లో చక్కెరకు బదులు బెల్లం వాడితో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
* బెల్లం తినడం వల్ల గ్యాస్ ఉబ్బరం పూర్తిగా తగ్గిపోతుంది.

 

* జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.
*బెల్లం శరీర ఉష్ణోగ్రతని నియంత్రణలో ఉంచుతుంది. దీని ఆంటి అలెర్జీక్ తత్వం వలన దమ్ము ఆస్తమా రోగులు తీసుకొంటే మంచి ఫలితాలు వుంటాయి.
*బెల్లం యొక్క గుణం వేడిచేయడం. కావున దీనిని మనం జలుబు, దగ్గులాంటివాటికి ఉపశమనం ఇస్తుంది. జలుబు వలన బెల్లం తినలేనట్లయితే చాయ్ లేదా లడ్డులో కూడా వాటిని కలిపి సేవించవచ్చు.

*శక్తి కోసం, బాగా నీరసం బలహీనత లక్షణాలు కనిపించగానే, బెల్లం సేవించినట్లయితే మీ ఎనర్జీ లెవెల్ త్వరగా పెరుగుతుంది. దీని వల్ల షుగర్ లెవెల్ కూడా పెరగదు. రోజంతా పనిచేసిన తర్వాత మీకు అలసటగా అనిపిస్తే వెంటనే బెల్లాన్ని తినేయండి.
*బెల్లం హాల్వా తీసుకొంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

Related posts