telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

ఇలా చేస్తే జలుబు తగ్గడమే కాదు ఇమ్యూనిటీ కూడా…!

Black-Pepper

జలుబు వచ్చిందంటే చాలు కొన్ని రోజులు అస్సలు తగ్గదు. దీంతో పాటు దగ్గు, జ్వరం, ఇతర సమస్యలు కూడా వస్తాయి. ఈ సమస్యని తగ్గించేందుకు మందులు వాడినా ఫలితం అంతగా ఉండదు. అయితే ఈ సమస్యకు ఇంట్లోని వంట దినుసులతోనే ఈజీగా చెక్ పెట్టేయొచ్చు.

మిరియాలు : పావు టీస్పూన్ మిరియాలను తీసుకోండి.. వీటిని నెయ్యిలో దోరగా వేయించండి.. వాటిని తినాలి. వీటిని తిన్న వెంటనే గోరు వెచ్చని పాలను తాగాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తుంటే జలుబు త్వరగా తగ్గుతుంది. మిరియాలని అలానే తినడం ఇష్టం లేకపోతే… వాటిని పొడిలా చేయాలి.. ఆ పొడిని గోరువెచ్చని పాలల్లో కలిపి తాగాలి. వీటితో పాటు.. నిమ్మరసంలో మూడు టీ స్పూన్ల తేనె మిక్స్ చేసి రోజులో ఉదయం, సాయంత్రం తీసుకుంటే జలుబు తగ్గుతుంది.

పసుపు పాలు : గోరువెచ్చని పాలల్లో పసుపు కలిపి ఆ పాలని తాగాలి. ఇలా తాగడం వల్ల కూడా జలుబు, జ్వరం నుంచి ఉపశమనం కలుగుతుంది. అలానే అల్లం కూడా జలుబుని తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. ఓ చిన్న అల్లం ముక్కని తీసుకోండి. దీనిని నీటిలో వేసి బాగా మరిగించండి. మరిగేటప్పుడు చిటికెడు పసుపు వేయండి.. ఆ మంటని తగ్గించండి.. ఇప్పుడు ఈ నీటిని గోరువెచ్చగా అయ్యేవరకూ ఉంచి అందులో తేనె వేసి కలిపి ఆ నీటిని తాగండి. ఇలా చేయడం వల్ల జలుబు తగ్గుతుంది. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

Related posts