telugu navyamedia
ఆరోగ్యం

లవంగంతో ఎంత ఆరోగ్యమో తెలుసా

మీరు తయారుచేసుకునే ఆహారం, వంటల్లో లవంగాన్ని మిస్సవకుండా చేర్చేయమంటున్నారు ఆరోగ్య నిపుణులు. పండ్లలో ఉండే విటమిన్ C, K, ఫైబర్, మాంగనీస్, యాంటీఆక్సిడెంట్స్ వంటివి లవంగంలోనూ ఉంటాయి. లవంగాల్ని పొడిగా చేసి దెబ్బతిన్న దంతం దగ్గరా, పాడైన చిగుళ్ల దగ్గరా పెట్టుకుంటే నొప్పిని తగ్గించేస్తుంది. అందుకే టూత్‌పేస్ట్ తయారీలో లవంగాల్నివాడుతుంటారు. జలుబు, దగ్గు, పడిశం లాంటివి ఏడిపిస్తూ ఉంటే నోట్లో ఓ లవంగం వేసుకొని చప్పరించాలి. ఇలా రోజుకు ఐదారు లవంగాల్ని చప్పరిస్తే ముక్కు సమస్యలు తొలగిపోతాయి. లవంగాలు తలనొప్పిని తగ్గిస్తాయి, బీపీని కంట్రోల్‌ చేస్తాయి, షుగల్ లెవెల్స్ సెట్ చేస్తాయి. లివర్, స్కిన్ సమస్యల్ని తగ్గిస్తాయి. పొట్టలో అల్సర్ సమస్యలకు కూడా లవంగాలు విరుగుడుగా పనిచేస్తాయి. లవంగాలు కేన్సర్ అంతు చూస్తాయి కూడా. కేన్సర్ కణాలు పెరగకుండా, వృద్ధి చెందకుండా లవంగాలు అడ్డుకుంటాయని పరిశోధనల్లో తేలింది.

బరువు తగ్గడానికి కూడా ఇవి సహకరిస్తాయి. మన శరీర ఎముకలు బలంగా ఉండాలంటే లవంగాలు తినాలి. వాటిలోని మాంగనీసు మన ఎముకలకు అవసరం అవుతుంది. బోన్స్ బలంగా ఉండేందుకు లవంగాల్లోని యూజెనాల్ నూనె చక్కగా పనిచేస్తుంది. లవంగం నీరు జీర్ణక్రియను పెంచుతాయి. అలాగే శరీర అధిక బరువును తగ్గిస్తాయి. శరీరంలో వేడిని తగ్గించడంలోనూ సాయపడతాయి. చాలామంది త్వరగా బరువు తగ్గేందుకు లవంగం నీటిని తాగుతారు. రాత్రి గ్లాసు నీటిలో రెండు లవంగాల్ని వేసి తెల్లారి వరకూ నానబెట్టాలి. ఉదయం అన్నింటికంటే ముందుగా ఈ నీటిని తాగి… లవంగాల్ని చప్పరించేస్తే సరిపోతుంది. బరువు తగ్గాలంటే… లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్రను వాడితే సరి. ఈ మూడింటినీ రోస్ట్ చేసి, పౌడర్ చెయ్యాలి. ప్రతీ రోజూ ఉదయం వేళ ఈ పొడిని ఓ టేబుల్ స్పూన్ తీసుకొని… ఓ గ్లాస్ నీటిలో వేసి ఉడకబెట్టాలి. ఉడికిన తర్వాత చల్లబరచాలి. ఈ డ్రింకులో టేస్ట్ కోసం కాస్త తేనె వేసి తాగితే… శరీరంలో అదనపు బరువు ఈజీగా తగ్గిపోతుంది. లవంగం నీరు తాగేటప్పుడు మీకు ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం తాగకపోవడమే మేలు. ఎందుకంటే… లవంగం నీరు కొంత మందికి పడదు. అలాంటివారు ఇతర ఆరోగ్య సూత్రాలు పాటించడం మేలు.

Related posts