telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

నేతితో .. మధుమేహబాధితులకు ప్రయోజనమే.. !

even sugar patients can take ghee healthy

నెయ్యి భారతీయులకు చాలా ప్రధాన ఆహార పదార్దాలలో ఒకటి. దానిని తీసుకోవటం ఆది నుండి వచ్చింది అంటే, దానిలో ప్రయోజనాలు చాలా వరకు అందరికి ఉన్నాయనే అర్ధం చేసుకోవాలి. ఇక ఇలా చెప్పినా కూడా, కొందరు దీనిని తీసుకోడానికి వెనకడుతూనే ఉంటారు. అందులో మధుమేహం సమస్యతో బాధపడుతున్న వారు కూడా ప్రధానంగా ఉంటారు. మరి వాళ్ళు తినవచ్చా.. లేదా అనేది తెలుసుకుందాం. దానికి ముందు ఒకటే చెప్పాలి. మితంగా ఏది తీసుకున్నా.. అది ఆరోగ్యానికి చాలా మంచిది. లేదంటేనే, సమస్యలు.

ఈ మధ్య జరిగిన పరిశోధనల ప్రకారం మధుమేహం ఉన్నవారు కూడా నెయ్యి తినవచ్చు, అయితే మోతాదు మించకూడదు. మరో ముఖ్య విషయం ఏమిటంటే ఇంటిలో తయారుచేసిన నెయ్యి అయితే చాలా మంచిది. ఒకవేళ ఇంటిలో తయారుచేసిన నెయ్యి లేకపోతే ఆర్గానిక్ నెయ్యిని మార్కెట్ లో కొనుగోలు చేయాలి. ఇప్పుడు నెయ్యి తింటే మధుమేహం వారికి ఎన్ని లాభాలు చేకూరతాయో తెలుసుకుందాం.

అన్నం, బ్రేడ్ వంటివి తిన్నప్పుడు వాటిలో ఉండే పిండిపదార్ధం రక్తంలో షుగర్ లెవల్స్ అమాంతం పెరిగిపోతూ ఉంటాయి. ఆలా కాకుండా అన్నంలో నెయ్యి వేసుకొని తింటే షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి.

even sugar patients can take ghee healthyశరీరంలో ఉండే చెడు కొలస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలస్ట్రాల్ ని పెంచుతుంది. దానితో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. నెయ్యి తింటే చాలా మంది కొలస్ట్రాల్ పెరుగుతుందని భావిస్తారు. కాని నిజానికి నెయ్యి కొవ్వును కరిగించటంలో సహాయపడుతుంది.

మధుమేహం ఉన్నవారిలో జీర్ణ సంబంధమైన సమస్యలు ఉంటాయి. వీరిలో ముఖ్యంగా మలబద్దకం సమస్య ఉంటుంది. వీరు అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే జీర్ణ సమస్యలు తొలగిపోయి సాఫీగా విరేచనం అవుతుంది.

నెయ్యిలో సమృద్ధిగా ఉండే లినోలీయిక్ యాసిడ్ మధుమేహ వ్యాధిగ్రస్తులలో గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు నెయ్యిని లిమిట్ గా తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

Related posts