telugu navyamedia
ఆరోగ్యం

క్యారెట్ తో కంటి స‌మ‌స్య‌ల‌కు చెక్‌..

రోజు ఎన్నో ఆరోగ్య సమస్యలతో కొంత‌మంది సతమతమవుతుంటారు..డాక్ట‌ర్ ఇచ్చిన మందులు వాడ‌డంతో పాటు.. ప్ర‌తి రోజూ సరైన పోషకాహారం తీసుకుంటే ఎలాంటి రోగాలకైనా చెక్ పెట్టొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆరోగ్యం బాగా ఉండడం కోసం రోజూ ర‌క‌ర‌కాల పండ్లు, కూర‌గాయ‌లు ఆహ‌రంలో తీసుకుంటాం..అందులో క్యారెట్ ఒక‌టి..

ప్రతిరోజూ క్యారెట్ తింటే కాలేయ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ లాంటి కొన్ని రకాల క్యాన్సర్ మీ దరిచేరదు. ముఖ్యంగా పరగడుపున క్యారెట్ తింటే త‌క్ష‌ణ‌మే శ‌క్తిని ఇవ్వ‌డంతో పాటు రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది.

Carrot Juice Recipe , How to make Carrot Juice - Vaya.in

ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్‌‌లు పుష్కలంగా లభిస్తాయి. ప్రతిరోజూ క్యారెట్ తింటే కాలేయ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ లాంటి కొన్ని రకాల క్యాన్సర్ మీ దరిచేరదు. అలాగే క్యారెట్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం.

క్యారెట్‌తో ప్ర‌యోజ‌నాలు..

* రోజూ ఓ క్యారెట్ తింటే కంటి చూపు మెరుగవుతుంది. క్యారెట్‌లోని విటమిన్ A పుష్కలంగా ఉంటుంది.

* క్యారెట్ మన ఒంట్లోని కొవ్వును కరిగిస్తుంది. దీంతో మీరు యాక్టీవ్‌గా ఉండేలా చేస్తుంది.

* క్యారెట్‌ గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంటుంది. ఇందులో ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియంతో అధికంగా ఉంటుంది.

*క్యారెట్‌లో ఉండే విటమిన్లు జుట్టు పొడిబారకుండా చేస్తాయి.

How did carrots become orange? | The Economist

* రోజు ఉదయాన్నే క్యారెట్‌ తింటే జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది.

* రక్త నాళాల ధమనుల ఉద్రిక్తతను తగ్గించేందుకు క్యారెట్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది.

* శరీరంలో రక్త ప్రసరణ పెంచేందుకు కూడా ఉపయోగపడుతుంది. చర్మం కాంతివంతగా ఉంచుతుంది.

* క్యారెట్‌లో రక్తహీనత పోగొట్టే గుణం ఉంటుంది.

* పేగుల్లో వ్వర్థాలను శుభ్రం చేసేందుకు క్యారెట్ దోహదం చేస్తుంది.

* క్యారెట్‌ను తరచు తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్యకు చెక్ పెట్టొచ్చు.

MAY Veggie of the Month: Carrot! – Barren River Intiative to Get Healthy Together

* క్యారెట్ జ్యూస్ రోజూ తాగడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఇన్‏ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.

* క్యారెట్‌లో ఉండే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్ చర్మ సమస్యలను నివారిస్తుంది.
దీనిలో ఉండే సోడియం అధిక రక్తపోటును నియంత్రిస్తుంది.

*రోజు ఉదయాన్నే క్యారెట్ తింటే చర్మ సంబంధిత అనారోగ్యాలు దూరమవుతాయి.

*క్యారెట్ రసంలో కాస్త తేనె కలిపి తీసుకోవడం వలన జలుబూ, గొంతు నొప్పి లాంటి సాధరణ వ్యాధులు తొందరగా తగ్గుతాయి.

Related posts