telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ సాంకేతిక

పబ్జీ పై ఆంక్షలు .. ఇక టైం లిమిట్..! తల్లిదండ్రులు హర్షం..!!

10 arrested for playing online pubg game

ఒక వీడియో గేమ్ కి యువత బానిసలవటంతో ప్రభుత్వం వరకు ఈ విషయం వెళ్లడం; వాళ్ళు కూడా స్పందించి సదరు గేమ్ సంస్థతో చర్చించి తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. పబ్జీ పై ఆంక్షలు పెట్టె విధంగా టెన్సెంట్ కంపెనీపై ఒత్తిడి తెచ్చింది భారత ప్రభుత్వం. యువత భవిత నాశనం చెయ్యటమే కాకుండాపబ్జీ ప్రాణాంతకంగా మారుతున్న నేపధ్యంలో పబ్జీ వాలాలకు షాక్ ఇచ్చింది. ప్రమాదకరమైన ఆట ఆడొద్దు అని తల్లిదండ్రులు మొత్తుకున్నా వినని యువతకు ఇక నుండీ ఆరు గంటలే పబ్జీ ఆట అని తేల్చి చెప్పేసింది. పబ్జీ ఆటపై టైం లిమిట్ పెడుతూ నిర్ణయం తీసుకుంది టెన్ సెంట్ గేమింగ్ కంపెనీ. పబ్జీ వాలాలకు షాకిచ్చే ఈ నిర్ణయంతో ఇండియా లో పబ్జీ గేమ్ కేవలం ఆరుగంటల వరకే ఆట ఆడే అవకాశం ఇస్తుంది.

యువతకు ఈ గేమ్‌ వ్యసనంలా మారిన తరుణంలో దానిని బ్యాన్‌ చేయాలని స్వచ్ఛంద సంస్థల దగ్గర్నుంచి రాజకీయ పార్టీల వరకు డిమాండ్‌ చేస్తున్నాయి. ఫలితంగా ఈ గేమ్‌కి అడ్డుకట్ట వేసే పని ప్రారంభమైంది. ఇకపై ఆరు గంటలు మించి పబ్‌జీ ఆడలేరు. ఇండియాలో కేవలం ఆరు గంటలు మాత్రమే పబ్జీ ఆడేందుకు అనుమతి లభించింది. ఎవరైనా రోజుకు 6 గంటలు పబ్జీ ఆడగానే తాత్కాలికంగా బ్లాక్‌ అవుతుంది. మళ్లీ మరుసటి రోజు వరకు ఇక పబ్జీ ఆడే అవకాశం లేకుండా చేసింది ఆ గేమింగ్ కంపెనీ. పబ్జీ 6 గంటలు ఆడగానే హెల్త్‌ రిమైండర్‌ రావడంపై అధికారికంగా ఎలాంటి స్టేట్‌మెంట్‌ విడుదల కాలేదు కానీ… ప్లేయర్స్‌ మొబైల్‌పై హెల్త్‌ రిమైండర్‌ పేరుతో నోటిఫికేషన్‌ కనిపిస్తోంది.

pubg in personal computer also18 ఏళ్ల లోపు వయస్సుగల ప్లేయర్స్‌కు 2 నుంచి 4 గంటల లోపే హెల్త్‌ రిమైండర్‌ నోటిఫికేషన్‌ వస్తోంది. సదరు గేమింగ్ కంపెనీ మీద చాలా ఒత్తిడి తెచ్చి ఈ నిర్ణయం తీసుకునేలా చేసింది భారత సర్కార్. ఇలా చెయ్యటం వల్ల కొంత వరకైనా అడిక్షన్ నుండి బయట పడెయ్యొచ్చు అని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నిర్ణయం పై తల్లిదండ్రులు కాస్త హర్షం వ్యక్తం చేసినా బ్యాన్ చేస్తే సమస్యకు పూర్తి స్థాయి పరిష్కారం దొరికినట్టు అవుతుందని భావిస్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తామని చెప్తున్నారు.

Related posts