యువతిపై అత్యాచారం చేశాడంటూ యాంకర్ ప్రదీప్‌పై వస్తోన్న ఆరోపణలపై ఆయన స్పందించారు. 139 మంది తనపై ఐదువేల సార్లు అత్యాచారం చేశారంటూ ఓ యువతి పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో మిర్యాలగూడకు చెందిన సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ యువతి చేసిన ఫిర్యాదు పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. అయితే యువతి ఇచ్చిన ఫిర్యాదులో యాంకర్ ప్రదీప్ మాచిరాజు పేరు కూడా ఉంది. దీంతో ప్రదీప్‌పై మీడియాలో రకరకాల కథనాలు వెలువడ్డాయి. ఆయన్ని నిందిస్తూ సోషల్ మీడియాలో చాలా మంది ట్రోలింగ్ మొదలుపెట్టారు. అలాగే యూట్యూబ్‌లోనూ వీడియోలు పోస్ట్ చేశారు. వీటిపై గురువారం ప్రదీప్ స్పందించారు. ఒక వీడియో మెసేజ్‌ను విడుదల చేశారు. ‘‘ఒక వ్యక్తికి న్యాయం చేయడం కోసం ఇంకో వ్యక్తి జీవితం నాశనం చేసేస్తారా?’’ అని ప్రదీప్ ప్రశ్నించారు. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, సోషల్ నెట్‌వర్క్‌లో కొంత మంది చేస్తోన్న టార్చర్ వల్ల నిజం తెలిసే లోపల తనకు గానీ, తన ఫ్యామిలీకి గానీ ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులు? అని ప్రదీప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మానసికంగా మానభంగం చేసినట్టే అని అన్నారు. దీని వెనుక ఎవరెవరు ఉన్నారో వాళ్లందరినీ బయటికి లాగుతానని ప్రదీప్ హెచ్చరించారు. అలాగే తనపై ఇష్టమొచ్చినట్టు రాతలు రాసేవారిపై, కామెంట్లు చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు.
previous post