telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విజయశాంతి కోసం కమల్ హాసన్ లా తిరిగాను… అయినా… : అనిల్ రావిపూడి

Anil-Ravipudi

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’‌. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో సీనియర్‌ హీరోయిన్‌ విజయశాంతి నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. మ‌హేశ్ న‌టిస్తోన్న 26వ చిత్ర‌మిది. ఈ సినిమా టీజ‌ర్ శుక్ర‌వారం విడుద‌లైంది. ఈ టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి హ్యుజ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కాగా… కొన్నేళ్లుగా రాజకీయాల్లో బిజీగా గడిపిన ఈ లేడీ అమితాబ్.. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే విజయశాంతి రీఎంట్రీ ఎలా సాధ్యమైందన్న చర్చ టాలీవుడ్‌లో జోరుగా జరుగుతోంది. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ రహస్యాన్ని అనిల్ బయటపెట్టారు. ఆయన మాట్లాడుతూ “విజయశాంతిని ఒప్పించడానికి చాలా సమయం పట్టింది. ‘రాజా ది గ్రేట్’ సమయంలోనే ఆమెను కలిశాను. మొదట రామ్‌తో ఆ సినిమా చేద్దామనుకున్నాను. విజయశాంతి పాత్ర నిడివి చాలా పెద్దదిగా కూడా ఉంటుంది. అయితే ఆ సమయంలో ఆమె ఒప్పుకోలేదు. తర్వాత కథలో మార్పులు జరిగి… రవితేజ, రాధికలతో చేశాం. ఈసారి మళ్లీ ప్రయత్నించాను. ఈ సమయంలో కథ చెబితే చాలు అనుకున్నాను. స్వాతిముత్యంలో సోమయాజుల చుట్టూ కమల్ హాసన్‌ తిరిగినట్టు తిరిగాను. ప్రసాద్, విజయశాంతిలకు నేను చేసిన ఫటాస్ సినిమా అంటే చాలా ఇష్టం. వారికి నేనంటే అభిమానం. అయితే నేను చెప్పేది వింటే ఎక్కడ ఒప్పేసుకుంటామన్నట్టు ముందు కథ వినడానికి సిద్ధపడలేదు. మూడు రోజుల వరకు కథ వినలేదు. కాఫీ తాగి, కొద్దిసేపు కూర్చొని వచ్చేసేవాడిని. ఆ తర్వాత రెండున్నర గంటలు కథ చెప్పాను. విజయశాంతి పొట్టపగిలేలా నవ్వారు. ఆమెను అలా ఎప్పుడూ చూడలేదు. నో చెప్పడానికి వీల్లేని స్క్రిప్ట్.. కథ, పాత్ర నచ్చి చేశారు. ఆవిడే చేయగలిగిన పాత్ర అది. స్క్రీన్‌పై ఆమెను చూస్తుంటే నాకే రోమాలు నిక్కబొడుచుకున్నాయి. నా దర్శకత్వంలో విజయశాంతి రీ ఎంట్రీ ఇవ్వడం గొప్పగా ఉంది. మహేశ్, విజయశాంతిలను ఒకే ఫ్రేమ్ లో చూశాక.. ప్రేక్షకులు త్రిల్ ఫీల్ అవుతారు. స్క్రీన్‌పై కనపడటానికి ఆమె తీసుకున్న జాగ్రత్తల చూస్తే హాట్సాఫ్ అనేలా ఉన్నాయి. కర్తవ్యంలో విజయశాంతిని చూసినట్టే ఉంది” అంటూ లేడీ సూపర్ స్టార్ రీ ఎంట్రీ వెనక అసలు విషయం చెప్పారు.

Related posts